Abdul JavidNandyal

ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు

నంద్యాల (పల్లెవెలుగు) 2 అక్టోబర్: కాంగ్రెస్ కమిటీ టౌన్ అధ్యక్షులు దాసరి చింతలయ్య ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ 152వ జయంతి వేడుకలను ఏఐసీసీ,  రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు డాక్టర్ సాకే శైలజానాధ్ ఆదేశాల మేరకు, నంద్యాల డీసీసీ అధ్యక్షులు జె. లక్ష్మి నరసింహ యాదవ్ ఆదేశానుశరం నంద్యాల టౌన్ అధ్యక్షులు దాసరి చింతలయ్య ఆధ్వర్యంలో నంద్యాల పట్టణలోని గాంధీ చౌక్ వద్ద ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాల వేసి గాంధీ జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది, ఈ సందర్బంగా మీడియాతో టౌన్ అధ్యక్షులు చింతలయ్య మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని స్వాతంత్రం రాక ముందు నుండి మహాత్మ గాంధీ కాంగ్రెస్ పార్టీ తోనే ఉంటూ అనేక ఉద్యమలు చేసి ప్రపంచంలో లో ఏ నాయకులు చెయ్యలేని అహింస మార్గంలో  సత్యగ్రం, క్విట్ ఇండియా, ఎన్నో ఉద్యమాలు చేసి మన దేశానికి  స్వతంత్రంను బ్రిటిష్ వారితో పోరాడి తెచ్చు కున్నాము. అలాగే రాష్ట్ర అధికార ప్రతినిధి మాట్లాడుతూ ఈనాడు మనం మన దేశంలో ప్రశాంతంగా జీవిస్తునం అంటే దానికి కారణం గాంధీ గారే నాని  ఆయన చూపిన మార్గం అందరికి ఆదర్శం అని  కొనియాడారు, కావున మనం కూడా అయన మార్గంలో నే బీజేపీ హటావో దేశ్ బచావో, దేశం లో అహింస ఎక్కువ అయిందని అయన భాద వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి యస్ యండి అబ్దుల్ రహమాన్, బాలకృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు శివరామి రెడ్డి, జిల్లా ట్రెజరర్ యస్ డివై ప్రసాద్, టౌన్ సీనియర్ నాయకులు యస్ యండి ఫరూక్, ఆర్టీసీ ప్రసాద్, బండి ఆత్మకూర్ మండల అధ్యక్షులు బత్తుల రవి, కార్యకర్తలు సుబ్బారాయుడు, శివ రెడ్డి తదితరులు  పాల్గొన్నారు.

Back to top button