Abdul JavidNandyal

ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో మహాత్మ గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలు

నంద్యాల (పల్లెవెలుగు) 2 అక్టోబర్:  స్థానిక నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్ సెంటర్ నందు లాల్ బహదూర్ శాస్త్రి  మరియు మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ప్రజాసంఘాల తో కలిపి పట్టణ అధ్యక్షులు గులాం హుస్సేన్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు ఆకుమల్ల రహీం గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి  చిత్రపటానికి పూలమాల వేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ భారత దేశానికి స్వాతంత్రం తేవడంలో మహాత్మా గాంధీ పాత్ర చాలా కీలకం. గ్రామాలే దేశానికి పట్టుగొమ్మలు అని గ్రామాభివృద్ధి  దేశాభివృద్ధి అని నమ్మి  గ్రామ స్వరాజ్యం కొరకు కృషి చేసిన వారు మన గాంధీ . అదే విధంగానే భారత దేశానికి రెండవ ప్రధాని గా పని చేసినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి స్వతంత్ర పోరాటంలో లాలాలజపతిరాయ్ గోపాల కృష్ణ గోఖలే లతో కలిసి గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమంలో మరియు ఉప్పు సత్యాగ్రహం ఉద్యమాలలో పాల్గొని చురుకుగా పాల్గొన్నారు. స్వాతంత్ర అనంతరం భారత తొలి ప్రధాని నెహ్రూ మరణానంతరం 1964 సంవత్సరం లాల్ బహుదూర్ శాస్త్రి ని దేశ రెండో ప్రధానిగా ఎన్నిక చేయడం జరిగింది 1965 సంవత్సరం లో ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధ సమయంలో సామరస్యంగా విజయం సాధించిన గొప్ప మేధావి. జై జవాన్ జై కిసాన్ అని నినాదంతో ఈ దేశంలో రైతుల యొక్క ప్రాముఖ్యత గురించి అదే విధంగా జవానులు యొక్క ప్రాముఖ్యత గురించి చాటిచెప్పిన గొప్ప జాతీయవాది. హరిత విప్లవానికి నాంది పలికిన గొప్ప వ్యక్తి .నిజాయితీతో పరిపాలన అందించినటువంటి గొప్ప రాజకీయవేత్త. కావున ఇలాంటి జాతీయ నాయకుల జీవిత చరిత్రలు దేశం కోసం చేసిన త్యాగాలు గురించి భవిష్యత్తు తరాలకు తెలియాలి అంటే ఇలాంటి వ్యక్తుల జయంతి మరియు వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వమే నిర్వహించడం వలన వారికి అవే నివాళులు. భవిష్యత్తులో ప్రభుత్వ సెలవు దినములలో గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా సెలవు అని ప్రకటించ వలసిందిగా మా ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని కోరడం జరిగినది. ఈ కార్యక్రమం నందు ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక కర్నూలు జిల్లా అధ్యక్షులు రహీమ్, పట్టణ  అధ్యక్షులు గులాం హుస్సేన్, కోశాధికారి డిపి మస్తాన్ వలి, ఉపాధ్యక్షులు నబి రసూల్, మదర్ యూత్ అధ్యక్షులు మురళి, ఐక్య వేదిక సభ్యులు మౌలాలి,  ఉస్మాన్, ఆల్ మదర్ ఫౌండేషన్ సభ్యులు మౌలాలి, మజీద్, హిదాయి తుల్లా, వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు కిరణ్, నబి రసూల్, తదితరులు పాల్గొన్నారు.

Back to top button