Nandyal

152 వ మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మెగా రక్తదాన శిబిరం

నంద్యాల (పల్లెవెలుగు) 2 అక్టోబర్ : 152  వ మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మెగా రక్తదాన శిబిరం  నిర్వహించామని నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ అన్నారు. శనివారం నంద్యాల సబ్ కలెక్టర్ వారి కార్యాలయం ఆవరణంలో 152  మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలను అలంకరించారు మరియు మెగా రక్తదాన శిబిరం ను నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్  ప్రారంభించి  బ్లడ్ డొనేట్ చేశారు అక్టోబర్ ఒకటో తారీకు నుండి అక్టోబర్ 15వ తారీఖు వరకు జిల్లా స్థాయి ప్రభుత్వ ఆసుపత్రి నంద్యాల వారు నిర్వహించే వాలంటరీ బ్లడ్ డొనేషన్ క్యాంపు లో భాగంగా నంద్యాల సబ్ కలెక్టర్ వారి కార్యాలయం ఆవరణంలో ఆంధ్ర ప్రదేశ్ సర్వే ఉద్యోగుల సంఘం నంద్యాల వారు నిర్వహించు బ్లడ్ డొనేషన్ కార్యక్రమానికి  నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ నంద్యాల రెవెన్యూ డివిజన్ సర్వే ఉద్యోగుల ప్రెసిడెంట్ ఆర్ రవి ప్రకాష్ జాయింట్ సెక్రెటరీ టీ సహదేవుడు సబ్ కలెక్టర్ కార్యాలయం DI  రవీంద్ర పాల్ నంద్యాల జిల్లా స్థాయి ప్రభుత్వ ఆసుపత్రిలో బ్లడ్ డొనేషన్ క్యాంపు సంబంధించిన డాక్టర్ సుధాకర్  తదితరులు హాజరై  మెగా బ్లడ్ క్యాంప్ నిర్వహించి రక్తదాన  దాతల నుండి బ్లడ్ ను స్వీకరించారు. అనంతరం

నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ మాట్లాడుతూ

ఈ రోజు మహాత్మా గాంధీ 152 వ జయంతి సందర్భంగా నంద్యాల రెవెన్యూ డివిజన్ లోని గ్రామ స్థాయిలో నియమికము కాబడిన  గ్రామ సర్వేయారులు విధుల్లో చేరి రెండు సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఈరోజు ఆంధ్ర ప్రదేశ్ సర్వే ఉద్యోగుల సంఘం నంద్యాల రెవిన్యూ డివిజన్ వారు  ఈ రక్తదాన శిబిరంలో పాల్గొని  బ్లడ్  డొనేషన్ చేస్తున్నారు  అని అన్నారు  అనంతరం మహాత్మాగాంధీ జీవితం గురించి హాజరైన వారికి   క్షునం గా వివరించారు.

డాక్టర్ సుధాకర్ గారు మాట్లాడుతూ

మన రాష్ట్రంలో అక్టోబర్ ఒకటో తారీకు నుండి అక్టోబర్ 15వ తారీఖు వరకు జిల్లా స్థాయి ప్రభుత్వ ఆసుపత్రి నంద్యాల వారు నిర్వహించే వాలంటరీ బ్లడ్ డొనేషన్ క్యాంపు లో భాగంగా ఈరోజు152 మహాత్మా గాంధీ జయంతి ని పురస్కరించుకొని నంద్యాల రెవెన్యూ డివిజన్ ప్రభుత్వ సర్వే ఉద్యోగులు ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించి బ్లడ్ డొనేట్ చేస్తున్నారని ఆయన అన్నారు

Back to top button