
Abdul JavidNandyal
ప్రజా ప్రతినిధులు ప్రజాస్వామ్య హక్కుల్ని కాపాడాలి మౌలానా ముస్తాక్ అహమ్మద్
నంద్యాల (పల్లెవెలుగు) 01 అక్టోబర్: ప్రజా ప్రతినిధులు ప్రజాస్వామ్య హక్కుల్ని కాపాడాలి అని మౌలానా ముస్తాక్ అహమ్మద్ అన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక రాష్ట్ర కన్వీనర్ మౌలానా ముస్తాక్ అహమ్మద్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య హక్కుల్ని కాపాడాల్సిన ప్రజా ప్రతినిధులు కౌన్సిల్ హల్ నందు వ్యక్తిగతంగా పొగడ్తలు చేయడం విమర్శలు చేయడం తగదన్నారు అధికార పక్షం ప్రతి పక్షానికి మాట్లాడే అవకాశం కల్పించాలని ప్రజలు ఓటు వేసి ప్రజా ప్రతినిధులను ఎన్నుకుని ప్రజల సమస్యలు తీర్చడానికి కౌన్సిల్లోకి పంపించిన విషయం ప్రజాప్రతినిధులు మరవకూడదని హితవుపలికారు కౌన్సిల్ విలువలను కాపాడాల్సిన భాద్యత ప్రజా ప్రతినిధులపై ఉందని ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని విజ్ఞేప్తి చేశారు