babaNandyal

రక్తదానం చేసిన షరీఫ్

నంద్యాల (పల్లెవెలుగు) 28 సెప్టెంబర్:  పట్టణంలో హేమచంద్రా రెడ్డి అనే 20 సంవత్సరాల అబ్బాయికి డెంగ్యూ జ్వరం వచ్చి ప్లేట్ లెట్స్ పడిపోవడంతో అత్యవసరంగా బి పాజిటివ్ ప్లేట్ లెట్స్ ఎక్కించాలి డాక్టర్ సూచించారు. బ్లడ్ బ్యాంక్ లో ప్లేట్ లెట్స్ స్టాక్ లేకపోవడంతో పేషెంట్ తరుపు బంధువులు ఆసరా సొసైటీ అధ్యక్షులు షేక్ బాబా ఫక్రుద్దీన్ ని సంప్రదించగ ఆయన వెంటనే స్పందించి తన మిత్రుడుడైన దూదేకుల షరీఫ్ ని పరిస్దితి వివరించగానే అతను వెంటనే తన బి పాజిటివ్ ప్లేట్ లెట్స్ రక్తాన్ని దానం చేసి ఆ అబ్బాయి ప్రాణాలు కాపాడటంలో సహయపడటం జరిగింది. సమయానికి స్పందించి తన బి పాజిటివ్ రక్తాన్ని దానం చేసిన రక్తదాత అయిన దూదేకుల షరీఫ్ ని కర్నూల్ జిల్లా ముస్లిం స్వర్ణకార సంఘం అధ్యక్షులు ఎన్.ఎండి.ఫయాజ్ అభినందించారు. మరియు పేషెంట్ తరుపు బంధువులు అతని కృతజ్ఞతలు తెలిపారు.

Back to top button