Abdul JavidNandyal

భారత్ బంద్ విజయవంతం

  • మూడు వ్యవసాయ నల్ల చట్టాలను రద్దు చేయాలి.
  • నూతన జాతీయ విధానం రద్దు చేయాలి సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ

నంద్యాల పట్టణంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ అనుబంధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గాంధీ విగ్రహం ఎదుట మోకాళ్ళ పైన కూర్చుని నిరసన చేయడం జరిగింది.  కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యా, కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూచేపట్టిన  భారత్ బంద్ విజయవంతంగా ముగిసిందని ఆదర్శ భవన నిర్మాణ కార్మిక సంఘం డివిజన్ అధ్యక్షులు షైక్ .మహమ్మద్, ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(PDSU) జిల్లా సహాయ కార్యదర్శి S.M.D.రఫీ, ప్రగతిశీల యువజన సంఘం (PYL) జిల్లా నాయకులు U.నవీన్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆదర్శ భవన నిర్మాణ కార్మిక సంఘం డివిజన్ అధ్యక్షులు షైక్ .మహమ్మద్, ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(PDSU) జిల్లా సహాయ కార్యదర్శి S.M.D.రఫీ, ప్రగతిశీల యువజన సంఘం (PYL) జిల్లా నాయకులు U.నవీన్ కుమార్ మాట్లాడుతూ  బిజెపి ప్రభుత్వం దేశాన్ని కార్పొరేట్లకు పెట్టుబడిదారులకు లాభాలు చేకూర్చడంలో భాగంగా నూతన జాతీయ విద్యావిధానం తీసుకువచ్చి ప్రభుత్వ విద్యా సంస్థలను నిర్వీర్యం చేసి కార్పొరేట్ వ్యవస్థ బలోపేతానికి ప్రయత్నిస్తోందని వారు అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పిన మోడీ ఉన్న ఉద్యోగాలు సైతం ఉడగొడుతున్నాడని వారు అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు అన్ని ప్రైవేటీకరణ చేస్తూ మోడీ దేశ ప్రజల సంపదని కార్పొరేట్లకు దోచి పెడుతున్నాడని వారు అన్నారు. విశాఖ ఉక్కు ఫ్రీవేటికరణ ఆపాలని, కడప ఉక్కు పరిశ్రమ సెయిల్ ఆధ్వర్యంలోనే ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. రైతులకు నష్టం కలిగించే 3 వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చి రైతులను తన పొలంలోనే కూలీలుగా చేయాలని చూస్తున్నదని తక్షణం రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. కరోనా కాలంలో ప్రజలను ఆదుకోవడంలో బీజేపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కానీ కరోన సాకుతో కార్పొరేట్ కంపిణీలకు కోట్లరూపాయలు కట్టబెట్టిందని వారు అన్నారు. కావున బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యా, రైతు, కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా జరిగిన బందులో  బీజేపీ మినహా అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్ధి సంఘాలు,ప్రజలు స్వచ్చందంగా బంధులో పాల్గొన్నారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ భవన నిర్మాణ కార్మిక సంఘం  డివిజన్ నాయకులు గంటల మా భాష మక్బూల్ , మా భాష, టైలర్ భాష, నాయక్, వినోద్, తదితరులు పాల్గొన్నారు.

Back to top button