Abdul JavidNandyal

నంద్యాల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో రైతులకు మద్దతుగా భారత్ బంద్ సంపూర్ణం

నంద్యాల (పల్లెవెలుగు) 27 సెప్టెంబర్: నంద్యాల కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో రైతులకు మద్దతుగా భారత్ బంద్ సంపూర్ణం సోమవారం తలపెట్టిన భరత్ బంద్ ను ఆర్టీసీ బస్టాండ్ నుండి గాంధీ చౌక్ వరకు ర్యాలీగా వామపక్షలను కలుపుకొని నంద్యాల టౌన్ అధ్యక్షులు దాసరి చింతలయ్య అధ్యక్షతన ఏఐసీసీ, ఏపీసీసీ మరియు నంద్యాల డీసీసీ అధ్యక్షులు జె లక్ష్మి నరసింహయాదవ్ ఆదేశానుసారం పెంచిన పెట్రోల్ డీజీల్ వంట గ్యాస్ మరియు మూడు రైతు వెతిరేక చట్టాలను రద్దు చెయ్యాలని రైతులకు మద్దతుగా దాసరి చింతలయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన మూడు  నల్ల చట్టాలను రద్దు చేయాలని, పెంచిన పెట్రోల్,డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించాలని, కేంద్ర విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలని, ఈరోజు జరిగే భారత్ బంద్ కు బాసటగా నిలిచినా ప్రసజలకు ధన్యవాదములు అలాగె వ్యాపారస్తులు, ఆర్టీసీ, స్కూల్ కాలేజీలు, బ్యాంక్లు, మొదలగు వారందరు స్వచ్చందంగా బంద్ కు సంహరించరాని ఇది మోదీ నిరంకుశ పాలనకు గద్దె దించడానికి సమయం అస్సన్నమైంది అని తెర్లిపారు, అలాగే యస్ డివై ప్రసాద్ జిల్లా ట్రెజరీ మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు గా భావించి ఆనాడు ఇందిర గాంధీ ఆంధ్రప్రదేశ్ కి కట్టబెడితే ఈ బీజేపీ ప్రభుత్వం దానిని కూడా అమ్మడానికి సిద్ధమైంది, కాంగ్రెస్ పార్టీ పాలనలో బీద బడుగు బలహీన వర్గాల ప్రజలకు మేలు చేసి సంపదను రెట్టింపు చేస్తే ఈనాడు మోదీ వచ్చి అన్ని అమ్మేస్తున్నాడు, ఎప్పుడైనా ప్రజలకు కళ్ళు తెరవక పోతే మనల్ని కూడా అమ్మేస్తాడు మోదీ. అలాగే యస్ యండి అబ్దుల్ రహమాన్ జిల్లా సెక్రటరీ మాట్లాడుతూ అయ్యా వైస్సార్ బిడ్డ ముఖ్యమంత్రి  జగన్ మెహన్ రెడ్డి గారు 23 ఎంపీ లను ఇస్తే కేంద్రం మెడలు వంచుతాం అన్నారుకదా, ఇదేంటయ్యా మీరు కేంద్రం వాళ్ళ కళ్ళు నాకు తున్నారు.  సిగ్గు సిగ్గు  కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేవని, కోవిడ్ నేపథ్యంలో ఉద్యోగాలు పోయి అనేకమంది నిరుద్యోగులు తయారయ్యారని, బిజెపి ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు కొమ్ము కాస్తూ, దేశంలో నూతన విద్యా విధానం పేరుతో విద్యా వ్యవస్థను నాశనం చేయడానికి తయారయిందని, సామాన్య ప్రజలు పెట్రోల్, డీజిల్, గ్యాస్ లాంటి నిత్యావసర వస్తువులు మరియు నిత్వవసర సరుకుల ధరలు అమాంతం పెంచి కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేస్తుందని, రైతు వ్యతిరేక చట్టాలను తీసుకు వచ్చి వ్యవసాయని కూడా కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టేందుకు సిద్ధమైందని వారన్నారు, ఈ భరత్ బంద్ లో కాంగ్రెస్ కమిటీ జిల్లా ఉపాధ్యక్షులు షైక్ అబ్దుల్లా, మైనారిటీ  నాయకులు రెడ్డి హుస్సేన్,  సుబ్బారాయుడు,  రియాజ్ మొదలగు కాంగ్రెస్ యువ నాయకులు పాలుగోన్నారు

Back to top button