Abdul JavidNandyal

వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ చేపట్టిన భారత్ బంద్ లో భాగంగా నంద్యాలలలో బంద్ నిర్వహించిన SDPI

నంద్యాల (పల్లెవెలుగు) 27 సెప్టెంబర్: ఎస్.డి.ఫై.ఐ నంద్యాల అసెంబ్లీ కార్యదర్శి అబుబకర్ మాట్లాడుతూ “రైతేరాజు” అని భావించే మన భారతదేశంలో బిజెపి ప్రభుత్వం తీసుకు వస్తున్నటు వంటి నల్ల చట్టాల వలన రైతులను కార్పొరేట్ శక్తులకు బానిసలుగా మార్చడం జరుగుతుందని, రాబోవు తరాలకు ఇది ప్రమాద సంకేతమని ఇటువంటి నల్ల చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది. నంద్యాల అసెంబ్లీ  సభ్యులు కరీముల్ల మాట్లాడుతూ ఈరోజు వామాపక్ష పార్టీలు మరియు ప్రజా సంఘాలను కలుపుకొని భారత్ బంద్ నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ప్రభుత్వం యొక్క అతివాద వైఖరి, అసహాయ చర్యల వలన ఈ రోజు రైతులను బానిసలుగా మార్చే చట్టాలనుతీసు కురావడం జరుగుతుంది. పాపులర్ ఫ్రంట్ డివిజన్ ప్రెసిడెంట్ ఫాజిల్ దేశాయ్ మాట్లాడుతూ ఇటువంటి విధానాలు దేశాన్ని అగమ్యగోచరంగా మార్చడం జరుగుతుందని దీనిని తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. ప్రభుత్వం వారు వెంటనే ఈ నల్ల చట్టాలను వెనక్కి తీసుకొని పక్షంలో రాబోవు కాలంలో ప్రజావ్యతిరేకత మరింత అధికమవుతుందని ప్రభుత్వం దీన్ని గమనించి తమ వైఖరిని మార్చుకోవాలని ఈ నిరసన వ్యక్తం చేయడం జరిగింది.  ఈ బంద్ కార్యక్రమంలో నంద్యాల అసెంబ్లీ కమిటీ సభ్యులు మజీద్ ఖాన్ , ఇద్రిస్ షేక్, కరిముల్ల, సద్దాం హుస్సేన్, జలీల్, హనీఫ్ , సనవుళ్ళ, కలాం, షఫీ, నురుల్ల ,సమీర్ , మహమ్మద్ అలీ , మక్బూల్ మరియు వందలాది మంది కార్యకర్తలు పాల్గొన్నారు .

Back to top button