Abdul JavidNandyal

అయ్యలురు ప్రాథమికోన్నత ఉర్దూ పాఠశాలను సందర్శించిన ఎమ్మెల్సి కత్తి నర్సింహారెడ్డి

నంద్యాల (పల్లెవెలుగు) 26 సెప్టెంబర్: అయ్యలురు ప్రాథమికోన్నత ఉర్దూ పాఠశాల ను టీచర్స్ ఎమ్మెల్సి కత్తి నర్సింహారెడ్డి శనివారం సాయంత్రం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన బడి నాడు నేడు పనులను ప్రభుత్వ ఆదేశాలు, సూచనల ను పాటిస్తూ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు పాఠశాల ను విద్యార్థుల బోధన కు ఉపయోగించె విధంగా, సామర్థ్యాలను పెంపొందించే విధం గా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు సి. అబ్దుల్ అజీజ్ ను అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానో పాధ్యాయుల అభ్యర్థన మేరకు పాఠశాల కు మంజూరైన రెండు అదనపు తరగతి గదుల నిర్మాణం, మరియు అకాడమీక్ ఇన్స్పెక్టర్ల నియామకం కొరకు తమ వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సి  విద్యార్థుల తొ పాఠ్య పుస్తకాలను అనుసరించి ప్రశ్నలు వేసి జవాబులు రాబట్టారు. 8వ తరగతి విద్యార్థులు, తమ పాఠశాలకు 23 లక్షల రూపాయలు వెచ్చించి పాఠశాలలో డ్యుయల్ డేస్క్లు, RO ప్లాంట్ ఏర్పాటు, డిజిటల్ బోధన కొరకు టివి,  జగనన్న విద్య కానుక, అమ్మవడి పథకంలో పేద ముస్లిం విద్యార్థులకు ఉన్నత విద్యను అభ్యసించటకు, గుణాత్మకం గా విద్య అందించేందుకు ఎల్లప్పుడూ తపన పడే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మామయ్య కు థాంక్స్ చెప్పాలని ఎమ్మెల్సి ని కోరారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో ఉపాధ్యాయులందరు కలిసి ఎమ్మెల్సి ని సన్మానించారు. ఈ కార్యక్రమం లో  ఎమ్మెల్సి వెంట ఎస్.టియు నాయకులు శ్రీనివాసులు, పాఠశాల పిసి కమిటీ చైర్మన్, ఉప చైర్మన్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Back to top button