Nandyal

క్రీడలతోనే ఉజ్వల భవిష్యత్తు – ఎంపీ పోచ

నంద్యాల (పల్లెవెలుగు) 25 సెప్టెంబర్: ప్రస్తుత పోటీ ప్రపంచంలో చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమని నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి అన్నారు. శనివారం పట్టణంలోని స్థానిక పద్మావతి నగర్లో ఉన్న నెరవాటి స్టేడియంలో కర్నూల్, కడప, అనంతపూర్, జిల్లాల స్థాయి బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ను ఎంపీ, ఎమ్మెల్యే శిల్పారవిచంద్ర కిషోర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటువంటి స్టేడియం నిర్మించడం చాలా ఖర్చుతో కూడుకున్నదని అయినా స్పోర్ట్స్ మీద మక్కువతో డాక్టర్ లక్ష్మయ్య, డాక్టర్ వినోద్ కుమార్, వి. శ్రీనివాస్ గుప్త నిర్మించి క్రీడాకారులకు సహాయపడుతున్నందుకు ధన్యవాదాలు తెలియజేశారు.  కోచ్ రాధాకృష్ణను ప్రత్యేకంగా అభినందించారు.  పట్టణం లో షటిల్ బ్యాడ్మింటన్ క్రీడకు మంచి ఆదరణ ఉందని అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో బ్యాడ్మింటన్ స్టేడియం నిర్మించడం చాలా గొప్ప విషయం అని  క్రీడాకారులు అందరూ ఇటువంటి సేవలు వినియోగించు కోవాలని కోరారు.

Back to top button