Nandyal

ఇస్లాం ప్రభోధకుల అరెస్టును ఖండిస్తూ నిరసన కార్యక్రమం

ఆల్ ఇండియా ఇమామ్స్ కౌన్సిల్, మజ్లిసుల్  ఉలమా వల్ అయిమ్మ నంద్యాల.

నంద్యాల (పల్లెవెలుగు) 24 సెప్టెంబర్: స్థానిక నంద్యాల గాంధీ చౌక్ నందు ఇస్లాం ప్రభోధకులు హజరత్ మౌలానా కలీమ్ సిద్దిఖి ని అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇమామ్ కౌన్సిల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హఫీజ్ మొహమ్మద్ అతవుళ్ళ ఖాన్ మాట్లాడుతూ సంఘ్ పరివార్ ఆజ్ఞ లపై నడిచే ప్రభుత్వం ఒకరి తర్వాత మరోక ముస్లిం మతపెద్దలకు వ్యతిరేకంగా చర్యలు ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయని, ఇస్లాం ప్రభోధకులు మౌలానా కలీమ్ సిద్దిఖి ని అరెస్టు చేయటాన్ని ఆల్ ఇండియా ఇమామ్స్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షులు మౌలానా అహ్మద్ బేగ్ నద్వీ తీవ్రంగా ఖండించారని తెలిపారు. ఉత్తరప్రదేశ్ A.T.S(యాంటి టెర్రరిస్ట్ స్క్వాడ్) అకస్మాత్తుగా మౌలానా కలీమ్ సిద్దిఖి ని అరెస్టు చేయడం రాజ్యాంగ వ్యతిరేకం మరియు సిగ్గుమాలిన చర్య. మతమార్పిడిలు చేస్తున్నారని మరియు విదేశీ ఫండింగ్ జరుగుతుందని ఆరోపణలు మొపి ఈ విధంగా చర్యలు తీసుకోవడం ఖండించదగ్గ విషయం ప్రతిదినము ఒక సమాజాన్ని లక్యంగా చేసుకని అన్యాయపు అరెస్టులు దేశంలో న్యాయాన్ని బలహీనపరుచుటం మరియు ప్రజల్లో నమ్మకలేమిని పుట్టిస్తుంది. అని ఈ సందర్భంగా తెలియచేశారు. లౌకిక రాజ్యం గా పరిరక్షణ  వేదిక రాష్ట్ర కన్వీనర్ మౌలానా ముస్తక్ అహ్మద్  మాట్లాడుతు ఇది ఒక దౌర్జన్యపు చర్య, దీనివలన ముస్లిం సమాజాన్ని మరియు మతపెద్దలను భయభ్రాంతులు చేసి వీరు చేసే సేవాకార్యాక్రమాలను నిలిపివేసి, దేశంలో జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలను నిలిపివేసే కుట్రలు జరుగుతున్నాయి. మౌలానా కలిముల్లా సిద్ధిఖీ ఒక మత ప్రచారకులు ఆయిన ఇస్లాం, శాంతి మతం యొక్క సందేశాన్ని వ్యాప్తి చేస్తారు. తద్వారా చాలా మంది జీవితాల్లో మార్పులు వచ్చాయి; అటువంటి సామాజిక ఆలోచనా పరుడిని అరెస్ట్ చేయడం చాలా ఖండించదగినది. ఆయినను తక్షణమే విడుదల చేయాలని మరియు అరెస్టు కు క్షమాపణ చెప్పాలని మరియు ATS  పై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. SDPI నంద్యాల అసెంబ్లీ ప్రెసిడెంట్ ఇక్బాల్ బాషా మాట్లాడుతూ అస్సాం లో శాంతి యుతం గా నిరసన తెలియ చేస్తున్న  ముస్లిం ల పై కాల్పులు జరపడం పోలీస్ వ్యవస్థ కు సిగ్గు చేటు అన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల ముస్లిం మత పెద్దలు మరియు భారీ సంఖ్యలో ముస్లిం ప్రజలు పాల్గొన్నారు .

Pavani.S

Pavani .S Devotional, Reporter, Nandyal Dist
Back to top button