Abdul JavidNandyal

దివ్యాంగురాలు పై అత్యాచారం చేసిన నిందితుడిని శిక్షించాలి

నంద్యాల (పల్లెవెలుగు) 23 సెప్టెంబర్: విశాఖ జిల్లా గూడెం కొత్తవీధి మండలం పీలేరు గ్రామములో సభ్యసమాజం తలదించుకునే రీతిలో దివ్యాంగురాలి పై అత్యాచారం చేసిన వైయస్ఆర్ సీపీ నేత నార్ల వెంకటరావు ఆమె చున్నీతో ఆమె నోరు మూసి అనంతరం ఆమెను బెదిరించి అత్యాచారం చేసినందుకు గాను నిందితుడిని వికలాంగుల చట్టం 2016 సెక్షన్ 92 ప్రకారం కఠినంగా శిక్షించాలని, అలాగే దిశా చట్టం అమలు చేయాలని  వికలాంగుల హక్కుల పోరాట సమితి (VHPS) జిల్లా ప్రధాన కార్యదర్శి డిపి మస్తాన్ వలి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నంద్యాల పట్టణంలోని గాంధీ చౌక్ లో గాంధీ విగ్రహం ఎదుట నిరసన తెలియజేసి, అనంతరం డిపి మస్తాన్ వలి విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ భర్త వదిలేసిన వికలాంగురాలిని ఆదుకోవాల్సిందిగా పోయి కనికరం చూపకుండా అత్యాచారం చేయడము, ఎవరికైనా చెబితే చంపేస్తానని చెప్పడం సభ్య సమాజం సిగ్గుపడేలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడిని నాన్ బెయిల్ వారెంట్ తో కఠినంగా శిక్షించాలని, ఆ వికలాంగురాలు కి న్యాయం జరిగేలా చూడాలని డిజిపి హోంమంత్రి సుచరిత ని పత్రికా ముఖంగా కోరడం జరిగినది. తక్షణమే ఈ ప్రభుత్వం వికలాంగుల చట్టం 2016 అసెంబ్లీలో ఆమోదిస్తే ఇలాంటి నిందితులకు కఠినంగా శిక్షించే అవకాశాలు ఉంటాయని, తమ పార్టీకి చెందిన నాయకులను కాపాడుకునేందుకు ఈ ప్రభుత్వము అమలు చేయడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే వైయస్సార్ సిపి పార్టీ లో ఉన్న అగ్రనాయకులు ఇలాంటి గుండాలకు, రౌడీలకు, రేపిస్టులకు ప్రోత్సహించి పదవులు ఇస్తున్నారని, వారిని ప్రజా ప్రతినిధులుగా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం గాంధీ విగ్రహానికి జరిగిన అన్యాయానికి నిరసనగా వినతిపత్రాన్ని ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి సభ్యులు కిరణ్ కుమార్, జిలాని, నబి రసూల్, జహీర్ మనన్, సుభాష్ యూత్ నాయకులు మౌలాలి తదితరులు పాల్గొన్నారు.

Back to top button