Abdul JavidNandyal

8వ రోజు రిలే దీక్షలకు మద్దతు తెలిపిన ఎస్డిపిఐ

నంద్యాల (పల్లెవెలుగు) 23 సెప్టెంబర్: రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలను రద్దు చేయాలని, వంట గ్యాస్, పెట్రోలు, డీజిల్ ధరలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని ఇంటి, చెత్త, కుళాయి, మురుగుకాలువ పన్ను తదితరాలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలి అని నంద్యాల పట్టణంలో గురువారం లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఎమ్మార్వో ఆఫీస్ ఎదురుగా 8వ రోజు రిలే దీక్షలకు మద్దతు తెలిపిన ఎస్డిపిఐ అసెంబ్లీ కార్యదర్శి అబు బకర్  అధ్వర్యంలో దీక్ష కూర్చోడం జరిగింది. ఎస్డిపిఐ అసెంబ్లీ ప్రెసిడెంట్ ఇక్బాల్ బాషా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును చూస్తే ఎంతో బాధ వేస్తుందని ప్రజల మీద అనవసరమైన భారాలు మోపుతూ చెత్త పన్ను విద్యుత్ ఛార్జీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పెంచిన కరెంట్ బిల్లు రద్దు చేయాలని గ్యాస్ డీజిల్ పెట్రోల్ రేట్లు జీఎస్టీ పరిధిలోకి తీసుకోవాలని  ఇంటి చెత్త కుళాయి మురికి కాలువల పన్ను ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్డిపిఐ అసెంబ్లీ కమిటీ సభ్యులు మజీద్ ఖాన్, సద్దాం హుస్సేన్, ఏజాస్ హుస్సేన్, కరిముల్ల, అక్తర్ హుస్సేన్, షఫీ వుళ్ళ, మక్బుల్ , హనీఫ్, ఖాజా హుస్సేన్, సనవుల్ల, మరియు భారీ గా కార్యకర్తలు పాల్గొన్నారు.

Back to top button