Nandyal

కానాల భూ వివాదంపై అలజడి

  • తహశీల్దార్‌పై బాధితుల తీవ్ర ఆరోపణలు – ఆరోపణలను కొట్టిపారేసిన తహశీల్దార్
  • తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన
  • తహశీల్దార్ వర్సెస్ బాధితుల మధ్య తీవ్ర వాగ్వివాదం
  • వివాదాల సుడిగుండంలో నంద్యాల తహశీల్దార్ కార్యాలయం

నంద్యాల (పల్లెవెలుగు) 22 సెప్టెంబర్ : నంద్యాల మండలం కానాల పోలి మేదలోని భూ వివాదం తీవ్రం అలజడిని రేపింది. నంద్యాల తహశీల్దార్ రవికుమారైపై బాధితుడు తీవ్రమైన ఆరోపణలు చేశారు. బాధితులు ఆరోపణలను ఆయన కొట్టిపారేశారు, తహశీల్దార్ జరుగుతున్న కార్యాలయంలో అన్యాయంపై బాధితులు కార్యాలయం ఎదుట నిరసన గళం వినిపించారు. తహశీల్దారు, బాధితులకు మధ్య తీవ్ర వాగ్వివాదం చోటు చేసుకుంది. నంద్యాల తహశీల్దార్ కార్యాలయం వివాదాల సుడిగుండానికి కేరాఫ్ట్. తహశీల్దార్ కార్యాలయ ఆవరణంలో ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఒక్కసారిగా వేడెక్కింది. చివరకు బాధితుడిపై తహశీల్దార్ కార్యాలయ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కానాల భూ వివాదం మరోసారి రచ్చకెక్కింది. నంద్యాల తహశీల్దార్ కార్యాలయం కేంద్రంగా సాగిన కానాల వివా దాస్పద భూ వివాదంపై మేజర్ న్యూస్ అందిస్తున్న కథనం ఇది. నంద్యాల మండలంలోని కానాల గ్రామ పోలిమేరలో రెండు సర్వే నెంబర్ లో 3,837 ఎకరాలపై భూ వివాదం. నడుస్తోంది. రెండు వర్గాలు భూమి తమదంటే తమదంటున్నారు. భూ వివాదంపై కోర్టులో వాజ్యం నడుస్తోంది. నంద్యాల కలెక్టర్ కార్యాలయంలో ఆర్ఓఆర్ కేసు కొనసాగుతుంది. ఈ క్రమంలో నంద్యాల తహశీల్దార్ కార్యాలయం జారీ చేసి రద్దు చేసిన ఫ్యామిలీ సభ్యుల పత్రంపై హైకోర్టు విచారణ జరిపి న్యాయం చేయాలని ఆదేశిస్తూ ఫ్యామిలీ సభ్యుల పత్రం రద్దును కొట్టి వేసింది. ఈ నేపథ్యంలో బాధిత రైతు కుటుంబం సభ్యుడు పెద్ద వెంక టమ్మ, చెన్నకేశవులు, వెన్న దేశవ, శివశంకర్‌లు తహశీ దార్ కార్యాలయ ఆవరణంలోని నికాంత్ భవనంలో పాత్రి కేయుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రెవెన్యూపై ఆరోప ణల వ్యవహారం కావడంతో నిశాంత్ భవన్ నిర్వాహకులు. బాధిత రైతు కుటుంబానికి సహాయ నిరాకరణ ఎదురైంది. బాధితులు ఆవరణ బయట పాత్రికేయుల : సమావేశాన్ని నిర్వహించారు. బాధితుడు చెన్నకేశవ మాట్లాడుతూ నంద్యాల రెవెన్యూ కార్యాలయం అవినీతికి నిలయంగా మారి పోయిందని ఆరోపించారు. రాత్రికి రాత్రి రికార్డులను తారు మారు చేస్తున్నట్లు విమర్శించారు. తమ పెద్దల ఆస్తిని పరులకు దారాదత్తం చేయడంతో న్యాయ స్థానాలపై నమ్మకంతో పోరాడుతున్నామన్నారు. చివరకు రాష్ట్ర అత్యున్నత న్యాయ స్థానం ఆదేశాలు అయ్యాయని అవేదన వ్యక్తం చేశారు. భూ వ్యవహారంలో నంద్యాల తహశీల్దార్ కార్యాలయంలోని ఇద్దరికి భాగస్వామ్యం కల్పించారని ఆరోపించారు. ఒక రెడ్డి దళారిని ఉన్నతాధికారి ఒకరు బినామీగా పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. ఒక వర్గాన్ని అడ్డం పెట్టుకొని బెదిరింపులకు దిగుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి అవినీతి రహిత పాలన అందించేం దుకు కృషి చేస్తుంటే నంద్యాల తహశీల్దార్ కార్యాలయం అవినీతిని ప్రోత్సహిస్తుందని ఆరోపించారు. కోర్టులో వాజ్యం నడుస్తున్నా హక్యు లేని వారికి పట్టాదారు పాస్ పుస్తకాన్ని జారీ చేశారన్నారు. న్యాయం కోసం తహశీల్దారును ఆశ్రయిస్తే క్రిమినల్ కేసులు పెడతానని బెదిరిస్తున్నారన్నారు. తనకు ప్రాణ హాని ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. రూ. 35 కోట్ల భూ వివాదం లో తనకు బెదిరింపులు వస్తున్నాయని ఆరోపించారు. ఈ వివాదంలో తాను చనిపోయినా తన కుటుంబానికి ఉన్నతా న్యాయం కోసం వేడుకున్నారు. ఈ స్థలం కోసం పోరాడుతూనే ఒక వారసురాలు మృతి చెందినా రెవెన్యూ అధికారులకు కనికరం లభించలేదన్నారు. ప్రస్తుతం మరో వారసురాలు హక్కు కోసం పోరాడుతున్న ఆమె ఆరోగ్యం దెబ్బతింటుందన్నారు. భూ వివాదంలో ఇద్దరు అధికారులు నియమ నిబంధనలకు విరుద్ధంగా ఉత్తర్వుల ను జారీ చేయడంతోపాటు ఒక వర్గానికి కొమ్ము కాస్తున్నారన్నారు. రెవెన్యూ అధికారి రవికుమార్‌తో తనకు ఎలాంటి విభేదాలు లేవని, తమ ఆస్తిని కాపాడుకోవడానికి ప్రభుత్వా నికి, ప్రజా ప్రతినిధులకు తెలియజేయడంలో భాగంగా  తమ కుటుంబం బయటకు వచ్చిందన్నారు. భూ వివాదం లో ఎవరికైనా అనుమానాలు ఉంటే నివృత్తి చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, బహిరంగ చర్చకు ఆయన అంగీకరిం చారు. నా ఆవేదనను అర్ధం చేసుకోవాలని రెవెన్యూ అధికారిని కించపరచడం ఉద్దేశ్యం కాదన్నారు. పాత్రికేయుల సమావేశాన్ని ఏర్పాటు చేస్తే కొందరు అడ్డుకునేందుకు చివరి వరకు ప్రయత్నాలు చేశారన్నారు. ఇప్పటికైనా జిల్లా కార్యాలయం ఎదుట బైరాయించిన దృశ్యం ఉన్నతాధికారులు న్యాయం చేయాలని బాధిత కుటుంబం వేడుకుంది.

Back to top button