Nandyal

గోపి క్రిష్ణ మెమోరియల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్

నంద్యాల (పల్లెవెలుగు) 09 సెప్టెంబర్:  పట్టణానికి చెందిన బొల్లినేని గోపికృష్ణ కోవిడ్ 19 కారణంగా 02/05/2021  స్వర్గస్తులైనారు, కావున వారి జ్ఞాపకార్థం నంది పైప్స్ ఇండోర్ స్టేడియం, నంద్యాల నందు కర్నూలు మరియు కడప జిల్లా క్రీడాకారులు కొరకు ఈనెల 11, 12 తేదీల్లో షటిల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. ఈ పోటీలు ఓపెన్ డబుల్స్ మరియు 40+, 50+ డబుల్స్ పురుషుల విభాగము నందు నిర్వహిస్తున్నారు. మొదటి బహుమతి పది వేలు, రెండో బహుమతి ఆరు వేలు, మూడవ బహుమతి నాలుగు వేల రూపాయలు ప్రతి విభాగంలో అంద చేయబడును. ఆసక్తి గల క్రీడాకారులు తమ ఎంట్రీలను 10వ తేదీ సాయంత్రం 7 గంటల లోపు

  • నాగార్జున Mob: 8985809434,
  • శ్యాం సుందర్ Mob: 8143220306

పంపగలరు. పోటీలు 11వ తేదీ ఉదయం 8 గంటలకు ప్రారంభించి 12వ తేదీ సాయంత్రం బహుమతి ప్రధానోత్సవం కార్యక్రమం నంది  గ్రూప్స్ మేనేజింగ్ డైరెక్టర్ సుజల మేడం గారిచే జరుపబడును ఆర్గనైజింగ్ కమిటీ ప్రెసిడెంట్ జి మణికుమార్ సెక్రటరి A.శ్యాంసుందర్ మరియు సభ్యులు తెలియజేశారు.

Back to top button