fayazNandyal

నా కుమార్తె ఆచూకీ తెలిస్తే చెప్పండి తల్లి షాబానా

నంద్యాల (పల్లెవెలుగు) సెప్టెంబర్ 06 : పట్టణంలోని ఫారూఖ్ నగర్ కు చెందిన ‘సనా’ (11) అనే బాలిక ఆచూకీ తెలీడం లేదని, తన తోటి స్నేహితురాళ్లతో కలసి 5 సెప్టెంబర్ 2021 ఆదివారం మధ్యాహ్నం బైటకు వెళ్లిన ‘సనా’ తిరిగిరాలేదని పాప కనబడకపోవడంతో  పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడం జరిగిందని, పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని పాప తల్లీ షబానా తెలిపారు. ఇంటి నుండి బైటకు వెళ్ళేటప్పడు పాప పసుపు రంగు పంజాబీ డ్రస్, గోధుమ రంగు (బ్రౌన్ కలర్) చున్నీ ధరించిందని ఎవరికైనా తన బిడ్డ ‘సనా’ ఆచూకీ తెలిస్తే వెంటనే నంద్యాల పోలీసులకు సమాచారం అందించాలని, లేదా  9502907710, 9346852765  ఫోన్ నంబర్లకు సమాచారం అందించాలని పత్రికా ముఖంగా తెలియజేసారు.

Back to top button