Abdul JavidNandyal

బేటీ బచావ్ అంటే ఇదేనా? కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన మౌలానా ముస్తాక్ అహమ్మద్

నంద్యాల (పల్లెవెలుగు) 5 సెప్టెంబర్: దేశ రాజధాని అయిన ఢిల్లీలో ఒక పోలీస్ అధికారిని అయిన సబియా సైఫీ అనే 21 ఏళ్ల అమ్మాయిని ఆమె స్నేహితుడు అనే నిజాముద్దీన్ అతి కిరాతకంగా మానభంగం చేసి ఆమె అవయవాలను సైతం పైశాచికంగా కోసి, హతమార్చడం చాలా దారుణమని లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక రాష్ట్ర కన్వీనర్ మౌలానా ముస్తాక్ అహమ్మద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసుల సమక్షంలో ఉన్న ఆ ఉన్మాదిని త్వరగా నడిరోడ్డు పై ఉరి తీసి సైఫీకి న్యాయం చెయ్యాలని ఆమె ఆత్మకు శాంతి కలిగే విధంగా, మోడీ కేజ్రీవాల్ ప్రభుత్వాలు చర్య తీసుకోవాలని, ఒక పోలీస్ అధికారికి రక్షణ కరువైన మన దేశంలో సామాన్యుల పరిస్థితి ఏమిటని మండిపడ్డారు. చిన్నారులు మహిళలు, చివరికి ముసలి వాళ్ళని కూడా వదలకుండా వారి పై తమ వికార కోరికలను తీర్చుకొంటు ఆనందం పొందుతున్న ఉన్మాదులను వెంటనే కాల్చి చంపే చట్టాన్ని అమలు చేయాలని మానభంగం చెయ్యాలి అంటే, ఈ మానవ మృగాలకు, ఒళ్ళు దద్దరిల్లే లా ఒక చట్టం కావాలని డిమాండ్ చేశారు

Back to top button