Mani NewsNandyal

బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో నంద్యాల మండల ఆఫీస్ నందు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కి వినతి పత్రం

నంద్యాల (పల్లెవెలుగు) 3 సెప్టెంబర్: టిడిపి అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు అర్హులైన పేదవారికి రద్దు చేసిన పెన్షన్లను తక్షణమే ఇవ్వాలని, ఏదైతే 3000 పెన్షన్ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం మూడు వేల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ పేద ప్రజలను ఇబ్బంది పెడుతున్న ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తూ నంద్యాల మాజీ శాసన సభ్యులు భూమా బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో నంద్యాల మండల ఆఫీస్ నందు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో నంద్యాల మండల కన్వీనర్ గురునాథ్ రెడ్డి, గోస్పాడు మండల కన్వీనర్ చంద్ర శేఖర్ రెడ్డి, నంద్యాల మరియు గోస్పాడు మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Back to top button