Abdul JavidNandyal

“శభాష్ ఇమామ్”  వైయస్ నగర్ వాలంటీర్ ను అభినందించిన జేఎసి సమద్

నంద్యాల (పల్లెవెలుగు) 3 సెప్టెంబర్: వైయస్ నగర్ 38వ వార్డు వాలింటీర్   షేక్ ఇమాం హుసేన్ సేవలను నంద్యాల ముస్లిం జేఎసి కన్వీనర్, జమాఆతే ఇస్లామి అధ్యక్షులు అబ్దుల్ సమద్ అభినందించారు. వివరాల్లోకి వెళితే  వైయస్ నగర్ 38వ వార్డుకు చెందిన జే.వేణుగోపాల్ , ఝాన్సీ దంపతుల కుమారుడు రేవంత్ (3సం) రక్తం గడ్డ కట్టని  “హిమోఫోలియా” వ్యాధితో బాధపడుతు, ప్రభుత్వ పరంగా లభించే డియంహెచ్ఓ పెన్షన్ రూ.10,000/- ప్రతి నెలా పొందు తున్నాడు. అయితే ఈ వ్యాధి తీవ్రత వల్ల తలలోని నరాల్లో రక్తస్రావం ప్రభావం చూపడంతో తమిళనాడు వేలూరు సీయంసి లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. అక్కడ వాళ్ళకు డబ్బు అవసరం ఉంది, ఈ నెల ఎలాగైనా పెన్షన్ అందివ్వాలని  తపనతో వాలంటీర్ షేక్ ఇమాం హుసేన్ వార్డు కౌన్సిలర్ టీ.సావిత్రమ్మ సహాయంతో, సచివాలయ ఇంచార్జీ అడ్మిన్ టీ. రమణ చొరవతో తమిళనాడు సీయంసీకి వెళ్ళి రేవంత్ తల్లి ఝాన్సీ కి పెన్షన్ పదివేలు చెల్లించి శభాష్ అనిపించుకున్నారు. వృత్తిలో వాలంటీర్ నిబద్ధతను జేఎసి కన్వీనర్ అబ్దుల్ సమద్ అభినందించారు. ఈ సేవలో సహకరించిన కౌన్సిలర్ సావిత్రమ్మ ను, అడ్మిన్ రమణ ని, యూత్ కౌన్సిల్ శివకుమార్ రెడ్డికి సమద్ ధన్యవాదాలు తెలిపారు.

Back to top button