
అడిషనల్ ఎస్పీ గా పదోన్నతి పొందిన డి.ఎస్.పి చిదానంద రెడ్డి కి సన్మానం
నంద్యాల (పల్లెవెలుగు) సెప్టెంబర్ 3: అడిషనల్ డిఎస్పి గా పదోన్నతి పొందిన నంద్యాల డిఎస్పి చిదానంద రెడ్డి కి ప్రగతి రూరల్ అండ్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగినది. శుక్రవారం కర్నూలు జిల్లా నంద్యాలలో డీఎస్పీ కార్యాలయంలో ప్రగతి రూరల్ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షురాలు, ఎస్సీ ,ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్ ఓ. మమతా రెడ్డి, డి.ఎస్.పి చిదానంద రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసి మెమెంటో అందజేసి శుభాకాంక్షలు తెలపడం జరిగినది. ఈ సందర్భంగా మమతా రెడ్డి మాట్లాడుతూ ఉద్యోగులు తమ విధులను సక్రమంగా నిర్వహిస్తే ప్రజల మన్ననలుతో పాటు హోదా పెరుగుతుంది అని కొనియాడారు మరియు ప్రగతి రూరల్ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఎంతో మంది పేదలను ఆదుకునే వివిధసేవ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని మరియు ఈ సంస్థ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీస్స్టేషన్ సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు.