Abdul JavidNandyal

వీది చిన్న వ్యాపారస్తుల సంక్షేమ సంఘం ఘనంగా వైఎస్సార్ 12వ వర్ధంతి

నంద్యాల (పల్లెవెలుగు) 2 సెప్టెంబర్:  స్థానిక వీది చిన్న వ్యాపారస్తుల సంక్షేమ సంఘం కార్యాలయం లో గురువారం అధ్యక్షులు సత్యం ఆధ్యర్యంలో వైఎస్సార్ 12వ వర్ధంతి  ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా చిన్న వ్యాపారస్తుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షుడు అకుమల రహీమ్ మరియు వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి డీపీ మస్తాన్ వలీ హాజరై వైఎస్సార్ చిత్ర పటానికి పూలా మాల వేసి నివాళులర్పించారు. అధ్యక్షుడు సత్యం మాట్లాడుతూ దివగంత ముఖ్యమంత్రి డాక్టర్ వై ఎస్. రాజశేఖర్ రెడ్డి చిరు వ్యాపారస్తులు గురించి ఆలోచించిన గొప్పనేత, ఆరోగ్య శ్రీ పథకం కింద ఎంతో మంది చిరు వ్యాపారులు లబ్ది  ఫోంది జీవితాలు కాపాడు కోవడం జరిగింది అని తెలిపారు.  గౌరవ అధ్యక్షుడు ఆకుమల రహీమ్ మాట్లుడుతు పేద ప్రజల హృదయాలలో చిర స్తాయిగా నిలిచి పోయేవిధముగా సేవలు అందించిన మహా నేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి అని, అభివృద్ధి, మరియు సంక్షేమం రెండు కళ్ళు లాగా భావించి పాలన సాగించిన గొప్ప నేత అని, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ పథకం, రైతులకు ఉచిత విద్యుత్, రైతు ఋణ మాఫీ, పేదలందరికీ ఆరోగ్యశ్రీ పథకం, ముస్లిమ్ ల కొరకు 4/శాతం  రిజర్వేషన్, బడుగు బలహీనర్గాలకు అనేక సంక్షేమ పతకాలు ప్రవేశపెట్టిన మహా నేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి అందువలననే రాజశఖరరెడ్డి గత 12సంవశరాలుగా భౌతికంగా మనమధ్య లేక పోయినా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రతి పేదవాని గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే స్థానం సంపాదించిన నేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి అని కొనియాడారు, ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి డీపీ మస్తాన్ వలీ, వీది చిన్న వ్యాపారస్తుల సంక్షేమ సంఘం కోషాది కారి నారాయణ, ఉపాధ్యక్షులు తిరుమలేశా,  సంజీవరాజు, సయ్యద్ మౌలాలి, సాంబ శివా రెడ్డి, యాగంటి మరియు సభ్యులు పాల్గొన్నారు.

Back to top button
Enable Notifications    OK No thanks