Nandyal

సి.పి.యస్. రద్దు చేసి ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయం చేయాలి – ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం

నంద్యాల (పల్లె వెలుగు) 1 సెప్టెంబర్:  ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నంద్యాల తాలూకా యూనిట్ వారి ఆధ్వర్యంలో ఈ రోజు అనగా 01.09.2021 న ఉదయం 11.00 గంటలకు స్థానిక కె.సి.కెనాల్ కార్యాలయ ఆవరణ యందు ప్రభుత్వ ఉద్యోగులు మరియు సి.పి.యస్. ఉద్యోగులు అందరూ సి.పి.యస్ రద్దు కొరుతూ ఉద్యోగులు ప్రభుత్వానికి ఎన్నికల ప్రచారములో భాగముగా ముఖ్య మంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి తమ ప్రభుత్వ అధికారం లోకి వఛ్చిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సి.పి. యస్.రద్దు చేసి ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయం చేస్తాం అని హామీ ఇఛ్చిన్నారు. కావున, ప్రభుత్వ ఉద్యోగులకు ఇఛ్చిన హామీని నెరవేర్చాలని సి.పి.యస్. ఉద్యోగులు రిటైర్డ్ అయినా వారికి చాలీ చాలని పెన్షన్ లతో వారు వారి కుటుంబాలు దుర్భర పరిస్థితులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కావున, ఈ సమస్యను పరిష్కరించి ఉద్యోగులకు న్యాయం చేయాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నంద్యాల తాలూకా తరపున ప్రభుత్వానికి విజ్జప్తి చేయడం జరిగినది. ఈ కార్యక్రమము లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నంద్యాల తాలూకా అధ్యక్షులు కె.నాగేoద్రప్ప, ప్రధాన కార్యదర్శి యస్. వెంకట రమేష్, మరియు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కర్నూలు జిల్లా సహాయ కార్యదర్శి ఇ.మల్లికార్జున రావు, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం మహిళా అధ్యక్షురాలు ఏ.లక్ష్మీదేవమ్మ, మరియు మహిళా ఉద్యోగులు మరియు ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నరు. ముఖ్య మంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి వెంటనే సి.పి.యస్. ను రద్దు చేసి ఓ.పి.యస్.ను అమలు చేయాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ముఖ్య మంత్రి కి విజ్జప్తి చేయడం జరిగినది

Back to top button
Enable Notifications    OK No thanks