Abdul JavidNandyal

ఐడియాల్ యూత్ మూవ్మెంట్ (IYM) నంద్యాల శాఖ నూతన కార్యవర్గం ఎన్నిక

నంద్యాల (పల్లెవెలుగు) 1 సెప్టెంబర్: ఐడియాల్ యూత్ మూవ్మెంట్ (IYM) రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రాహీం షరీఫ్ ఆధ్వర్యంలో నంద్యాల శాఖ నూతన కార్యవర్గాన్ని  ఎన్నుకున్నారు, ఎన్నిక లో భాగంగా ఐవైయం పాలసీ ప్రోగ్రాం ను నంద్యాలలో జమాఅతె ఇస్లామి హింద్ కార్యలయంలో స్థానిక జెఐహెచ్ అధ్యక్షులు సమద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సమద్ మాట్లాడుతూ ఐవైయం యువకులను నైతికంగా తీర్చిదిద్ది ఉత్తమ పౌరులుగా మలుచుతుంది. సమాజంలో ఉన్నా రుగ్మతలను నిర్ములించడానికి కృషి చేస్తుందని అన్నారు. జమాత్  సభ్యులు మౌమిన్ గౌస్  మాట్లాడుతూ యువకులు ఐవైయం తో కలసి పనిచేయాలని అన్నారు. ఐవైయం రాష్ట్ర అధ్యక్షులు ఇబ్రాహీం షరీఫ్  ఆధ్వర్యంలో నంద్యాల శాఖ నూతన కార్యవర్గ అధ్యక్షులుగా ఫేక్ రషీద్ ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది, రషీద్ మాట్లాడుతూ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతీఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమం లో ఐవైయం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి‌ కలీముల్లా ఖాన్, ఉపాధ్యక్షులు హాజిపీరా స్థానిక ఐవైయం సభ్యులు  జమాన్ ఇమ్రాన్ పాషా మహమ్మద్ హుస్సేన్ అప్జల్ బాషా, ఆబిద్ ఇర్ఫాన్  సలీం తదితరులు పాల్గొన్నారు

Back to top button