
నిరుపేద కుటుంబానికి నిత్యవసర సరుకులు పంపిణీ
నంద్యాల (పల్లెవెలుగు) 30 ఆగష్టు: మదర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నంద్యాల బైరమల్ వీధిలో ఉన్నటువంటి బసవేశ్వర స్వామి దేవాలయం పురోహితులు కొలనుభారతి పంచాంగకర్త శ్రీ శశి భూషణ్ సిద్ధాంతి, గుప్త దాత సహకారంతో బండి ఆత్మకూరు మండలంలో నిరు పేద కుటుంబానికి చెందిన పక్షవాతం వచ్చి అనారోగ్యంతో బాధ పడుతున్నటువంటి రామారావు కుటుంబముకు నిత్యావసర సరుకులకు సహకరించారు. ఈ సందర్భంగా మదర్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు డి.మురళీ మాట్లాడుతూ బండిఆత్మకూరు మండలంలో నిరుపేద కుటుంబానికి చెందిన పక్షవాతంతో బాధ పడుతున్నటువంటి రామారావుకు బండి ఆత్మకూరు ఎమ్మార్వో పింఛన్ మంజూరు చేయవలసిందిగా మరియు తన ఇల్లు కూలిపోవడంతో తన కుటుంబం నివాసం ఉండడానికి ఇల్లు నిర్మాణానికి ప్రభుత్వాన్ని సహాయం కోరడం జరిగినది. ఇంకా దాతలు ముందుకు వచ్చి పక్షవాతం వచ్చినటువంటి రామారావు కుటుంబానికి ఆర్థికంగా ప్రతి ఒక్కరూ మీ వంతుగా కుటుంబ పోషణకు సహకరించవలసిందిగా మురళి కోరారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగుల హక్కుల పోరాట జిల్లా కార్యదర్శి డి.పి మస్తాన్ వలి, బండి ఆత్మకూరు మండలానికి చెందిన ప్రైవేట్ స్కూల్ టీచర్ సుబ్రహ్మణ్యం, ఆర్.ఎం.పి డాక్టర్ రామరాజు , మహమ్మద్ రఫీ, ముద్ద సిర్ సభ్యుడు హుస్సేన్ వలి పాల్గొన్నారు.