
Abdul JavidNandyal
పిఆర్టియు నాయకునికి ఘన సన్మానం
నంద్యాల (పల్లెవెలుగు) 29 ఆగష్టు: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల యం.తిమ్మాపురం లో పాఠశాల సహాయకులు గా పనిచేస్తున్న పిఆర్టియు మాజీ రాష్ట్ర అసోసియేషట్ అధ్యక్షుడు అబులైస్ ని పిఆర్టియు నాయకులు ఘనంగా సన్మానించారు. నంద్యాలలో జరిగిన సన్మాన కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.కరుణానిధి మూర్తి , జిల్లా అధ్యక్షులు క్రిష్ణారెడ్డి , జిల్లా ప్రధాన కార్యదర్శి భార్గవ రామయ్య, రాష్ట్ర నాయకులు రామకృష్ణ, కృష్ణా రావు, విజయరావు, చంద్రమౌళి, కిరణ్, జెసి నరసింహహు లు, సుమయోను, రాఘవేంద్ర నంద్యాల, గోస్పాడు, మహానంది, బండిఆత్మకూరు, గడివేముల, శిరివెల్ల, పాణ్యం మండలాల పిఆర్టియు నాయకులు పాల్గొని ఆయనను ఘనంగా సన్మానించి ఆయన సేవలను కొనియాడారు.