
గుడిలో కోతికి కరెంట్ షాక్ తగితే ఎంచేసారో చేలుసా…?
నంద్యాల (పల్లెవెలుగు) 29 ఆగష్టు నంద్యాలలో బస్టాండ్ పక్కన ఉన్న ఆంజనేయస్వామి గుడిలో కోతికి కరెంట్ షాక్ తగిలి సృహ తప్పి పడిపోయిన స్థితిని చూసి సిటీ కేబుల్ కెమెరామెన్ రాజేష్ మదర్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు డి.మురళి కి ఫోన్ చేసి సమాచారం ఇవ్వగా వారు వెంటనే స్పందించి మదర్ యూత్ అసోసియేషన్ సభ్యుడు డి. హుస్సేన్ వలి తో కలిసి వెటర్నరీ డాక్టర్ సుబ్బయ్యకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వగా వారు ఆదివారం సెలవు దినం అయినా కూడా వెంటనే స్పందించి సృహ కోలుపోయిన కోతికి నాలుగు ఇంజెక్షన్ లు వేసి మరియు టెంకాయ నీళ్లు తో దాహం తీర్చడం ద్వారా ఈ కోతి ఆరోగ్యంగా కోలుకున్నది.ఈ సందర్భంగా మదర్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు డి.మురళీ మాట్లాడుతూ సమయానికి డాక్టర్ సుబ్బయ్య వెంటనే స్పందించి ఆంజనేయస్వామి గుడి దగ్గరకు వచ్చి కోతికి చికిత్స చేయడం వలన కోతి యొక్క ప్రాణాలు కాపాడ గలిగారు ఇలాంటి వారిని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని చెప్పడం జరిగినది. ఈ కార్యక్రమంలో మదర్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు డి. మురళి,వెటర్నరీ డాక్టర్ సుబ్బయ్య, సభ్యులు పాండు సింగ్, హుస్సేన్ వలి పాల్గొన్నారు.