Nandyal

రైతు నగర్ లో ఉన్న వక్స్ బోర్డు  స్థలంలో ఉర్దూ జూనియర్ , డిగ్రీ కాలేజీ, ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని రెండో రోజుకు చేరుకున్న రిలే నిరాహార దీక్షలు

నంద్యాల (పల్లెవెలుగు)29 ఆగష్టు: పట్టణంలో వామపక్ష మైనార్టీ సంఘాల ఆధ్వర్యంలో రెండో రోజు రిలే నిరాహార దీక్ష రెండో రోజు స్థానిక. ఎమ్మార్వో కార్యాలయం ఎదురుగా నిర్వహించడం జరిగింది. ఈ దీక్షలో కూర్చున్న ఆవాజ్ కమిటీ అధ్యక్షుడు ఎస్ బాబుల్లా, ఇన్సాఫ్ కమిటీ డివిజన్ నాయకులు షరీఫ్ బాషా. ఆవాజ్ కమిటీ డివిజన్ నాయకులు అక్రమ్ భాష. ఆవాజ్ నాయకులు కమల్ భాష. ఖాదర్. దీక్షలో కూర్చోవడం జరిగింది . ఈ దీక్షలకు  పిడిఎస్యు  జిల్లా సహాయ కార్యదర్శి రఫీ అధ్యక్షత వహించారు. ఈ దీక్షలకు ప్రారంభించిన సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్. బాబా పక్రుదిన్. ఆవాజ్ కమిటీ జిల్లా కన్వీనర్ ఎస్ మస్తాన్ వలి. ఇన్షాఫ్ జిల్లా  నాయకులు ఎస్ రియాజ్ ప్రారంభం చేయడం జరిగింది.  ఈ దీక్షలకు మద్దతు ఇచ్చిన వారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ ఏవి సుబ్బారెడ్డి . ఏఐటీయూసీ. పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు చింతలయ్య. ఎస్డిపిఐ నాయకులు అబూబకర్. దళిత గిరిజన సమాఖ్య జిల్లా అధ్యక్షుడు మధు. వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు  మస్తాన్ వలీ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా తెలుగుదేశం రాష్ట్ర నాయకులుఏవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ నంద్యాల రైతునగరంలో  ఖాళీగా  ఉన్న వక్ఫ్ బోర్డు  స్థలాల్లో ఉర్దూ జూనియర్, డిగ్రీ, ఉర్దూ యూనివర్సిటీ లైబ్రరీ ల్యాబ్ రేటర్ నిర్మించి,  ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయాలి వారు రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు .మరియుఖబర్ స్తాన్ ఈద్గా లను నిర్మించాలి. రాష్ట్ర వ్యాప్తంగా గా పెండింగ్లో ఉన్న దులహన్ పథకం అమలుకు నిధులు వెంటనే మంజూరు చేయాలి వారు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అదేవిధంగా ఆవాజ్ కమిటీ. ఇన్షాఫ్ కమిటీ.  ముస్లిం మైనార్టీ సంఘాలు చేసే ప్రజాపోరాటాలకు తన సంపూర్ణ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని తెలియజేశారు.

Back to top button
Enable Notifications    OK No thanks