Abdul JavidNandyal

మైనార్టీ సంఘాల ఆధ్వర్యంలో రెండవ రోజు రిలే దీక్షలకు వికలాంగుల హక్కుల పోరాట సమితి మద్దతు

నంద్యాల (పల్లెవెలుగు) 29 ఆగష్టు: పట్టణంలో మైనార్టీ సంఘాలు వామపక్ష పార్టీలు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే దీక్షలకు వికలాంగుల హక్కుల పోరాట సమితి నాయకులు సంపూర్ణ మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి డి పీ మస్తాన్ వలీ మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో వక్స్ బోర్డు  స్థలాలు అన్యాక్రాంతం అయిపోతున్నాయి అని, స్థలాలను కబ్జా చేసి ఇల్లు కట్టుకుంటున్న కూడా అధికారులు నాయకులు స్పందించాలనే పరిస్థితి ఏర్పడిందన్నారు. రైతు నగరం లో ఖాళీగా ఉన్న వక్స్ బోర్డు స్థలాలలో ఉర్దూ జూనియర్ డిగ్రీ కళాశాలను ఉర్దూ యూనివర్సిటీ లైబ్రరీ ల్యాబ్ లెటర్ నిర్మించి ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయాలని అన్నారు. అలాగే నిరుపేద ముస్లింలకు ఉపయోగ పడేలా మసీదులు దీర్ఘాలు ముస్లిం స్మశానవాటికలు నిర్మించాలని కోరారు. ప్రజా సంఘాలు చేసే పోరాటాలకు వికలాంగుల హక్కుల పోరాట సమితి సంపూర్ణ మద్దతును తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వీహెచ్పీఎస్ నాయకులు రసూల్, కిరణ్, జిలాని,మనన్, రామలింగం తదితరులు పాల్గొన్నారు.

Back to top button
Enable Notifications    OK No thanks