
శ్రీకృష్ణ జయంతి ఉత్సవాలు జయప్రదం చేయండి
నంద్యాల (పల్లెవెలుగు) 27 ఆగష్టు: పద్మావతి నగర్ నడిబొడ్డున వెలసిన శ్రీకృష్ణ మందిరం నందు యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరుపుకొనుటకు యాదవ సంఘం పెద్దలు నిర్ణయించినారు. కావున 29.8.2021 ఉదయం 10 గంటలకు కబడ్డీ పోటీలు జిల్లాస్థాయి హోమ్ టీమ్స్ ప్రారంభమగును గెలిచిన విజేతలకు
- మొదటి బహుమతి 20.000. వేల రూపాయలు
- రెండో బహుమతి 15.000. వేల రూపాయలు
- మూడవ బహుమతి 10.000 వేల రూపాయలు
- నాల్గవ బహుమతి 5.000. రూపాయలు
బహుమతులు ప్రకటించారు కావున కబడ్డీ పోటీలలో పాల్గొనదలచిన వారు
- సుబ్రహ్మణ్యం యాదవ్ 9441243601.
- శివ లింగం యాదవ్ 9392895761
సెల్ నెంబర్ కు ఫోన్ చేసి ఎంట్రీ చేసుకోవాల్సిందిగా తెలియజేశారు. అలాగే శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు రాత్రి 12 గంటలకు పూజా కార్యక్రమాలు నిర్వహించబడును అలాగే ఉదయం గోపూజ జెండా వందనం ఉట్టి కొట్టే కార్యక్రమం గ్రామోత్సవము వచ్చిన భక్తులకు అల్పాహారము భోజనము ఏర్పాటు చేయడం జరిగినది. 30.8.21 సాయంత్రము ఏడు గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగును కావున నంద్యాల పట్టణ పరిసర ప్రాంత ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తూ ఈ యొక్క దైవ ఈ కార్యక్రమంలో శ్రీకృష్ణ భక్తాదులు మరియు యాదవ సోదర సోదరీమణులు అందరూ పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరడమైనది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు నాని, విజయ్, శేఖర్ యాదవ్, సాయి కృష్ణ యాదవ్, సంకల శ్రీనివాస్ యాదవ్, విజయ్ గౌరీ యాదవ్, బోధనం చంద్ర శేఖర్ యాదవ్, చంద్ర యాదవ్, రాముడు యాదవ్ గడిగరేవుల వెంకటేశ్వర్లు యాదవ్ అడ్వకేట్ మధు యాదవ్ సాయిబాబా నగర్ శ్రీనివాస్ యాదవ్ బండారు నాగేశ్వరరావు యాదవ్ తదితరులు పాల్గొన్నారు