
Nandyal
అంధుల పాఠశాలలోని పిల్లలకు అన్నప్రసాద వితరణ
నంద్యాల (పల్లెవెలుగు) 27 ఆగష్టు: మదర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నంద్యాల సంజీవ నగర్ లో నివాసం ఉన్న తాళంకి సత్యనారాయణ గారి సతీమణి కీర్తిశేషులు తాళంకి శేష కాంతమ్మ జయంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు నంద్యాలలోని సెయింట్ లూక్స్ అంధుల పాఠశాలలోని పిల్లలకు రుచికరమైన ఆహారంతో అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మదర్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు డి.మురళి, సభ్యుడు డి.హుస్సేన్ వలి పాల్గొన్నారు.