
Abdul JavidNandyal
ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మదర్ తెరిస్సా 111వ జయంతి
నంద్యాల (పల్లెవెలుగు) 26 ఆగష్టు: పట్టణంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఎదురుగా ఉన్న మదర్ తెరిసా విగ్రహానికి మదర్ యూత్ అసోసియేషన్ ఆల్ మదర్ ఫౌండేషన్ సుభాష్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ తదితర ప్రజాసంఘాల ఆధ్వర్యంలో పూలమాల వేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు ఆకుమల్ల రహీం మురళి డిపి మస్తాన్ వలి తదితరులు మాట్లాడుతూ మదర్ తెరిస్సా సేవకు ప్రతిరూపం అని, అనాధలకు కుష్టి రోగులకు ప్రభుత్వాసుపత్రిలో రోగులకు నిస్వార్ధంగా చేసిన మానవతా వాది, విశ్వమాత అనే అని ఆమె సేవలను కొనియాడారు . ఈ కార్యక్రమంలో సభ్యులు మౌలాలి, హీదాయితుల్లా తదితరులు పాల్గొన్నారు