Abdul JavidNandyal

దోమల బెడద నుంచి నంద్యాల ప్రజలకు ఉపశమనం కలిగించాలని కోరుతూ వినతి

నంద్యాల (పల్లెవెలుగు) 24 ఆగష్టు: డెంగ్యూ ,టైఫాయిడ్, మలేరియా నంద్యాల పట్టణంలో వ్యాప్తి చెందకుండా ప్రతి వార్డు లో ఫాగింగ్ మరియు  బ్లీచింగ్ పౌడర్ చల్లాలని  వినతి పత్రం అందించిన SDPI  నంద్యాల అసెంబ్లీ  ఈ రోజు నంద్యాల మునిసిపల్ కమీషనర్ వెంకట కృష్ణ గారికి దోమల బెడద నుంచి నంద్యాల ప్రజలకు ఉపశమనం కలిగించాలని కోరుతూ వినతి పత్రాన్ని అందించిన SDPI అసెంబ్లీ కార్యదర్శి అబు బకర్ మాట్లాడుతూ  గత కొన్ని రోజుల నుంచి మన నంద్యాల పట్టణంలో దోమల బెడద ఎక్కువగా ఉంది. దీని వలన సీజనల్ వ్యాధులు  టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ మొ౹౹  సోకే అవకాశం ఎక్కువగా ఉంది.  కావున మన నంద్యాల లోని అన్ని వార్డులలో ఉన్న మురికి  కాలువలు మరియు డ్రైనేజీ వ్యవస్థ అపరిశుభ్రమైన చోట శుభ్రంగా చేయాలని  మరియు యుద్ధప్రాతిపదికన మన నంద్యాల మునిసిపాలిటీ పరిధిలోని అన్ని వార్డులలో  బ్లీచింగ్ పౌడర్ మరియు ఫాగ్గింగ్ చేయించాలని SDPI పార్టీ తరపున కోరారు.  ఈ కార్యక్రమంలో సలీం నగర్ sdpi నాయకులు హఫీజ్ ఇమ్రాన్, ఈసక్  మరియు కార్యకర్తలు పాల్గొన్నారు

Back to top button
Enable Notifications    OK No thanks