babaNandyal

నంద్యాల మునిసిపల్ టీడీపీ ఫ్లోర్ లీడర్ గా మాబువలి ఎన్నిక

నంద్యాల (పల్లెవెలుగు) 23 ఆగష్టు: మాజీ మంత్రివర్యులు ఎన్.ఎండి.ఫరూక్ మరియు నంద్యాల మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి ఆదేశాలతో నంద్యాల మునిసిపల్ టీడీపీ ఫ్లోర్ లీడర్ గా నంద్యాల మున్సిపాలిటీ 34 వ వార్డ్ కు చెందిన టీడీపీ కౌన్సిలర్ ముల్లా మాబువలి ని ఎన్నుకొని తమ నిర్ణయాన్ని మాజీ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానంద రెడ్డి. లెటర్ హెడ్ ద్వారా ఈ రోజు నంద్యాల మునిసిపల్ కమీషనర్ వెంకటకృష్ణుడు ని కలిసి తమ పార్టీ నాయకుడు తీసుకున్న నిర్ణయాన్ని అధికారికంగా గుర్తించాలని కోరిన నంద్యాల టీడీపీ కౌన్సిలర్లు మరియు టీడీపీ నాయకులు. ఈ సందర్బంగా టీడీపీ ఫ్లోర్ లీడర్ గా అవకాశం ఇచ్చినందుకు టీడీపీ పార్టీ కి, నాయకులకు మరియు కౌన్సిలర్లకు మాబువలి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

Back to top button
Enable Notifications    OK No thanks