Abdul JavidNandyal

అసంఘటిత రంగ కార్మికుల ప్రక్రియను వినియోగించుకోండి

కరోనా కష్టకాల సమయంలో వలస కార్మికులు మరియు అసంఘటిత రంగ కార్మికులు ఇబ్బందిలో మరియు కష్టాలను పరిగణలోకి తీసుకొని స్పెషల్ లీవ్ పిటిషన్ 6/2020 తేదీ 29/06/2021 ద్వారా సుప్రీం కోర్ట్ ఆదేశాల ప్రకారం కేంద్ర ప్రభుత్వం  సంఘటితం రంగ కార్మికులకు సామాజిక భద్రత కల్పించే ఉద్దేశంతో ఈ శ్రమ్ పోర్టల్ ప్రవేశపెట్టింది కావున ఈ సర్వేలో అసంఘటిత రంగ కార్మికుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగును కావున అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీనియర్ కమిషనర్ యన్. బషీరునిస్స బేగం మరియు సహాయ కార్మిక అధికారి A Md సమీర్, మహమ్మద్ రఫీ తెలిపారు. పట్టణంలోని రైతు నగరం దగ్గర ఎలక్ట్రిషన్ జనరల్ బాడీ మీటింగ్ నందు నంద్యాల ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కార్మికుల జనరల్ బాడీ సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసంఘటిత రంగం కార్మికుల నమోదు ప్రక్రియ ఈనెల 26వ తేదీ నుండి అసంఘటిత రంగ కార్మికులకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగును ఈ పథకంలో అసంఘటిత రంగం కార్మికులు అనగా భవనం నిర్మాణ కార్మికులు వలస కార్మికులు ఇండ్లలో పని చేసేవారు వ్యవసాయ కూలీలు వీధి వ్యాపారులను ఆశ వర్కర్లు అంగన్వాడి వర్కర్స్ మచ్చ కార్మికులు ప్లాంటేషన్ వర్కర్స్ పాల వ్యాపారస్తులకు వ్యాపారం మొదలైన వారు ESi ఈ పీఎఫ్ సభ్యత్వం లేని వారందరూ ఈ పథకానికి అర్హులు అదేవిధంగా 18 నుంచి 50 సంవత్సరాల మధ్యవయసు గలవారు ఈ పథకానికి అర్హులని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ కొరకు ఎటువంటి రుసుము చెల్లించనవసరం లేదు ఉచితంగా పేర్లు నమోదు జరుగుతుంది, పక్రియ నమోదుకు ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ పాస్ బుక్ జిరాక్స్ కాపీ సెల్ నెంబర్ ఇవ్వాలి. అదేవిధంగా ఈ పథకం వల్ల లాభాలు అసంఘటిత రంగం కార్మికుల సామాజిక భద్రత కొరకు ఆర్థిక సహాయం కార్మికుల నామిని అకౌంట్ లోకి నేరుగా జమ చేయబడుతుందన్నారు. ప్రధానమంత్రి  శ్రమ యోగి మన్ దాన్ పథకంలో లో కూడా కార్మికులు చేరవచ్చునని వారు కోరారు. ఈ సమావేశంలో నంద్యాల ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డి. హుస్సేన్, ఉపాధ్యక్షులు యన్.ఎండి రఫీ, కార్యదర్శి గోపాల్ రెడ్డి, సహాయ కార్యదర్శి గురు మూర్తి, ట్రెజరర్ రామయ్య, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Back to top button