Abdul JavidNandyal

నిరుపేద కుటుంబానికి నిత్యవసర సరుకులు పంపిణీ

నంద్యాల (పల్లెవెలుగు) 22 ఆగష్టు: మదర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నంద్యాలలోని కల్పనా సెంటర్ లో ఉన్న ప్రింటింగ్ ప్రెస్ యజమాని అరవేటి ధర్మతేజ, మౌనిక దంపతుల కుమార్తె ఓషిక పుట్టినరోజు సందర్భంగా నంద్యాలలో నందమూరినగర్ లో నివాసం ఉన్నటువంటి నిరుపేద కుటుంబానికి చెందిన మౌలాలి భాష  కూతురు గొంతు ఆపరేషన్ కు ఖర్చు అయినందువలన వారి కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఉండడం చూసి నందమూరి నగరానికి చెందిన ఫోటోగ్రాఫర్ కిషోర్ మదర్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు డి. మురళి ని సంప్రదించగా వారు దాతల సహకారంతో ఈ కుటుంబానికి నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరిగినది. ఈ సందర్భంగా దాతలకు మదర్ యూత్ అసోసియేషన్ వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మదర్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు డి.మురళి, సభ్యులు ఫోటోగ్రాఫర్ కిషోర్, దివ్యాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి డి.పి.మస్తాన్ వలి, హుస్సేన్ వలి పాల్గొన్నారు.

Back to top button
Enable Notifications    OK No thanks