Abdul JavidNandyal

ఉర్దూ స్కూల్ కాంప్లెక్స్ ను తనిఖీ చేసిన డిప్యూటీ ఇన్స్పెక్టర్

నంద్యాల (పల్లెవెలుగు) 21 ఆగష్టు: నంద్యాల మండలం ముల్లాన్ పేట బాలికల ఉర్దూ ఉన్నత పాఠశాలలో మారిన సిలబస్ పై ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిక్షణ కార్యక్రమం ను ఉర్దూ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఉర్దూ రేంజ్ ఆదమ్ బాష తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉర్దూ పాఠశాలల అభివృద్ధికి ఉర్దూ విద్యార్థుల విద్య భవిష్యత్ కు సంబంధించిన ప్రణాళికను సిద్ధం చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని కోరారు. ఈ కార్యక్రమం లో కాంప్లెక్స్ చైర్మన్ ఫయజుర్ రెహమాన్, ఉర్దూ ప్రాధమిక పాఠశాలల సూపర్వైజర్ నౌమాన్ బాష, ఉన్నత పాఠశాలల సూపర్వైజర్ హుస్సేన్, అబ్దుల్ అజీజ్, షమీమ్, ఉర్దూ నవాజ్ బాష, పాల్గొన్నారు.  ఈ కార్యక్రమం లో నంద్యాల, మహానంది, పాణ్యం తదితర వివిధ మండలాల నుంచి 45 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు..

Back to top button
Enable Notifications    OK No thanks