Abdul JavidNandyal

బియ్యం కోసం ఆధార్ ‘అప్ డేట్స్’ అగచాట్లు.. అధికారులు వివరణ ఇవ్వాలి -జేఏసి సమద్

నంద్యాల (పల్లెవెలుగు) 21 ఆగష్టు: ఆధార్ అప్ డేట్ చేయకుంటే బియ్యం ఇవ్వరు అన్న అనధికార ప్రకటన పేదవారికి పరుగులు పెట్టిస్తుంది. ఆధార్ కేంద్రాల వద్ద పరస్థితి బాధ కల్గిస్తుందని నంద్యాల ముస్లీం జేఎసి కన్వీనర్ అబ్దుల్ సమద్ వాపోయారు. వారం రోజులుగా పనుల వదలుకునీ , పిల్లలను వెంట తీసుకుని ఆధార్ నమోదు కేంద్రాల చుట్టు తిరుగుతున్న ప్రజలను చూస్తే జాలి కలుగుతందని , అన్ని సచవాలయాలలో కేంద్రీకరించాం అని చాటుకుంటున్న ప్రభుత్వంలో ప్రజలకు ఈ కష్టాలు ఏంటీ అని సమద్ ప్రశ్నించారు. నమోదు సెప్టెంబర్ వరకు చేసుకోవచ్చని వార్త వచ్చిన ప్రభుత్వ పథకాలు ఎక్కడ కోల్పోతామో అని ప్రజలు ఆధార్ కేంద్రాల్లో ఈ సడింపులు భరిస్తం ఆందళోన చెందుతున్నారన్నారు. ఈ దృశ్యాలు అధికారులు దృష్టికి రాక పోవడం విచిత్రంగా ఉందని సమద్ ఆందోళన  వ్యక్తపరిచారు.  ఇప్పటికైనా అధికారులు ఈ విషయం పై ప్రకటన చేసి వాలంటీర్ ద్వార భరోసా కలిగించాలనీ , ప్రజల ఇంటవద్దనే ఆధార్ ప్రక్రియ పూర్తి చేయించాలని సమద్ సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేసారు.

Back to top button
Enable Notifications    OK No thanks