Abdul JavidNandyal

గిరిజన గుడి పూజారులకు గౌరవ వేతనమివాలి

  • సీఎం దృష్టికి తీసుకెళ్లాలని నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారిని విన్నవించిన గిరిజన ప్రజా సమాఖ్య నాయకులు.
  • తండాలలో నిర్మించిన ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలి…… గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజు నాయక్

నంద్యాల ( పల్లెవెలుగు) 21 ఆగష్టు: గిరిజన గుడి పూజారులను ప్రభుత్వం గుర్తించి  ప్రతి నెల 10 వేల రూపాయల గౌరవ వేతనం చెల్లించాలని, ఈ విషయంపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి గిరిజనులకు న్యాయం చేయాలని శనివారం  నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నివాసంలోని జిపిఎస్ నాయకులు విన్నవించారు.  ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాజు నాయక్  ఎమ్మెల్యేతో మాట్లాడుతూ రాష్ట్రంలోని 13 జిల్లాలో ఉన్నా గిరిజన సుగాలి జాతికి చెందిన 5000 మంది పూజారులు ఉన్నారని వారికి కనీసం ఇప్పటి దాకా ఎటువంటి జీతభత్యాలు లేకుండా ఆలయ అభివృద్ధికి దీప, నైవేద్య, అమ్మవార్ల అలంకార కార్యక్రమాలు పూజారులు పనిచేస్తున్నారని విన్నవించారు.  గిరిజన సుగాలి గుడి పూజారులకు ఎలాంటి  ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.

 గిరిజన జాతి పూజారులు కడు పేదవారు, రెక్కాడితే గానీ డొక్కాడదు, అలాంటి భిన్నమైన పరిస్థితి మా గిరిజనుల ది..అత్యధికంగా వీరు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు, వీరు సంపాదించిన దానితోనే కుటుంబాలు పోషించుకుంటూ, బంజారా దేవి దేవతలకు చాలీ చాలని నైవేద్యం సమర్పించుకుంటున్నారు. ప్రతి తండాలలో గిరిజనులంతా ఐక్యమత్యంతో స్వయంగా మేమే ఆలయాలు నిర్మించుకున్నామని, వారి అభివృద్ధికి ప్రభుత్వం చొరవ తీసుకుని అక్కడే కళ్యాణ మండపాలు ఏర్పాటు చేయాలని వారు కోరారు.

గిరిజనులను ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని రాష్ట్రము లోని గిరిజన గుడి అర్చకులకు కూడా  ఒక్కొక్కరికి  రు.10, 000/- పది వేలు ప్రతి నెల గౌరవ వేతనంతో పాటు కళ్యాణ మండపాలు ప్రభుత్వమే కట్టించి ఇవ్వాలని ఈ విషయం గౌరవ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని కోరారు.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019 ఎన్నికల మేనిఫెస్టోలో గుడి పూజారులను గౌరవ వేతనం గా ప్రకటిస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అందుకే గిరిజన గుడి పూజారులను, తండాలలో ఉన్న ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం చొరవ తీసుకొని కేబినెట్ మీటింగ్ లో కొంత మొత్తం బడ్జెట్ అమలు చేసి గిరిజనులకు న్యాయం చేయాలని నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ని కోరారు.

ఈ కార్యక్రమంలో గిరిజన ప్రజా సమాఖ్య రాష్ట్ర సహాయ కార్యదర్శి రవి నాయక్, జిల్లా అధ్యక్షుడు బాలు నాయక్, ప్రధాన కార్యదర్శి అడ్వకేట్ విజయ్ నాయక్, బంజారా ధర్మ సేన రాష్ట్ర అధ్యక్షుడు రాజా రామ్ నాయక్, సుగాలి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నేనావత్ శంకర్ నాయక్, మరియు తదితరులు పాల్గొన్నారు

Back to top button
Enable Notifications    OK No thanks