Abdul JavidNandyal

కేంద్ర ప్రభుత్వం  విడుదల చేసిన నోటిఫికేషన్ రద్దు చేయాలి

నంద్యాల (పల్లెవెలుగు) 21 ఆగష్టు:  ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగ నియామకాల నుంచి వికలాంగులకు మినహాయింపు ఇస్తూ  సాధికారత శాఖ ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్ ను ఉపసంహరించుకోవాలని వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి డీపీ మస్తాన్ వలి ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.  స్థానిక ఆత్మకూరు బస్టాండ్ సమీపంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో వికలాంగులకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించాలని 2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం సెక్షన్ 34 పేర్కొన్న దని, ఈ సెక్షన్ ను దుర్వినియోగం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు.  పని స్వభావాన్ని బట్టి వికలాంగులకు మినహాయింపు ఇవ్వాల్సి వస్తే చీఫ్ కమిషన్ లేదా రాష్ట్ర కమిషనర్ తో సంప్రదించాల్సిన అవసరం లేదా? అని ప్రశ్నించారు అందుకు విరుద్ధంగా కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడం సరికాదని పేర్కొన్నారు. ఇండియన్ పోలీస్ సర్వీసెస్ మరియు ఇండియన్ రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ పరిధిలోని అన్ని కేటగిరీల నుంచి వికలాంగులను మినహాయించాలని నిర్ణయం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని తెలిపారు.  వైకల్యం కలిగిన వ్యక్తులు పని చేయడానికి అనువుగా ఉండే పోస్టులను మాత్రమే గుర్తించాలంటూ చట్టం చెబుతుంటే దానికి భిన్నంగా కేంద్రం నియామకాల నుంచి వికలాంగులను మినహాయించాలని నిర్ణయించడం అనేది చట్టాన్ని  ఉల్లంఘించడమేనని తెలిపారు. ఈ కార్యక్రమంలో విహెచ్ పి ఎస్ నాయకులు జిలాని, నబి రసూల్, వీర భరతుడు, కిరణ్, మద్దిలేటి  తదితరులు పాల్గొన్నారు.

Back to top button
Enable Notifications    OK No thanks