
అసైన్డ్ భూముల చట్ట సవరణను ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలి సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ డిమాండ్
నంద్యాల (పల్లెవెలుగు) 21 ఆగష్టు: రాష్ట్ర ప్రభుత్వం 19 77 అసైన్డ్ భూములు చట్ట సవరణ వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ నంద్యాల డివిజన్ కార్యదర్శి ఎన్.శంకర్ డిమాండ్ చేశారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయం నందు కాజా మియా అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 6వ తేదీన రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన జరిగిందని ఈ క్యాబినెట్ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం 1977 అసైన్డ్ భూముట్ట్ట చట్టంలోని సెక్షన్ 3 సవరిస్తూ చేసిన సవరణను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ చట్ట సవరణ వల్ల గతంలో వివిధ ప్రభుత్వాలు దళితులకు గిరిజనులకు మరియు వెనుకబడిన వర్గాలకు పంపిణీ చేసిన ఇంటి స్థలాలు భూములకు భూస్వాములు నుండి పెత్తందార్ల నుండి రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు నుండి పెను ప్రమాదం పొంచి ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చట్ట సవరణ వల్ల దళితుల గిరిజనులు బలహీన వర్గాల భూములకు రక్షణ కరువై పోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 2007వ సంవత్సరంలో కోనేరు రంగారావు భూ కమిటీని నియమించాలని ఆ కమిటీ నిజనిర్ధారణ ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 36 లక్షల ఎకరాల భూములు అన్యాక్రాంతం అయ్యాయని అలా అన్యాక్రాంతమైన భూములను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకున్న సందర్భాలు లేవని ఆ భూములను దళితులకు పేదలకు గిరిజనులకు పంపిణీ చేసిన దాఖలాలు లేవని ఆయన తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో దళితుల అనుభవంలో ఉన్న భూములను 20 సంవత్సరాల తర్వాత అసైన్డ్ భూములను అమ్ముకోవచ్చని సవరణ చేశారని అయితే ప్రస్తుత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు అతని కంటె ఘనుడు ఆచంట మల్లన్న అన్న సామెత లాగా ఉందన రదళితులు అనుభవంలో ఉన్న అసైన్డ్ భూములను 10 సంవత్సరాల తర్వాత అమ్ముకోవచ్చని చట్ట సవరణ చేయడం దుర్మార్గమైన చర్య అని ఆయన విమర్శించారు ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో భూస్వాములు పెత్తందారుల నుండి దళితుల భూములకు ప్రమాదం పొంచి ఉందని ఆయన తెలిపారు. భూస్వాములకు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు జగన్ మోహన్ రెడ్డి తలొగ్గి వారి కోరిక మేరకు ఈ చట్ట సవరణ చేశాడని ఆయన విమర్శించారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అసైన్డ్ భూముల చట్ట సవరణను తక్షణమే ఉపసంహరించుకోవాలని లేనిపక్షంలో అన్ని ప్రజా సంఘాలు రైతు సంఘాలు రైతు కూలీ సంఘాలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐ ఎఫ్ టి యు నంద్యాల డివిజన్ కార్యదర్శి చౌడప్ప ఐ.ఎఫ్.టి.యు డివిజన్ నాయకులు రఫీ ఆదర్శ భవన నిర్మాణ కార్మిక సంఘం డివిజన్ నాయకులు ఎస్ మహమ్మద్ కిరణ్ యాకూబ్ అఖిల భారత రైతు సంఘం నాయకులు గోవిందు అల్లా bakas తదితరులు పాల్గొన్నారు