Abdul JavidNandyal

నంద్యాల మున్సిపల్ కౌన్సిల్ ను రాష్ట్రంలో అగ్రగామిగా నిలపండి – జమాఆతె ఇస్లామి

నంద్యాల (పల్లెవెలుగు) 20 ఆగష్టు: వందేళ్ళ చరిత్ర తో కార్పోరేషన్ స్థాయి కలిగిన నంద్యాల మున్సిపాలిటిని రాష్ట్రంలో అగ్రగామిగా నిలుపాలని, అవినీతి రహిత పాలన అందివ్వడానికి కృషి చేయాలని జమాఆతె ఇస్లామి హింద్ నంద్యాల అధ్యక్షులు అబ్దుల్ సమద్ కౌన్సిల్ కు అభ్యర్ధించారు. చాంద్ బాడాలోని జమాత్ కార్యాలయంలో నూతనంగా ఎన్నికైనా కోఆప్శన్ కౌన్సిలర్ సయ్యద్ సలాముల్లా మరియు 11వ వార్డు కౌన్సిలర్ ముహమ్మద్ తమీమ్ ను అబ్దుల్ సమద్ అధ్యక్షతన జమాత్ సన్మానించింది. మంచివాళ్ళు ,దైవ భీతి గలవారు రాజకీయాలలో తప్పక రావాలని అపుడె మంచి పాలనా వస్తుందన్నారు. జనాబ్  ముహమ్మద్ జకరియా ఖుర్ఆన్ వాక్యాలు ఉటంగిస్తు మాట్లాడారు. మోమీన్ గారు మాట్లాడుతూ మంచి నడతతో రాజకీయాలలో మార్గదర్శకంగా నిలువాలన్నారు. సయ్యద్ సలాముల్లా మాట్లాడుతు కమ్యునిటిని గుర్తించి తనకు ఇచ్చిన పదవికి న్యాయం చేస్తానన్నారు. కౌన్సిలర్ తమీమ్ మాట్లాడుతూ తాను పెద్దవాళ్ళును ఆదర్శంగా తీసుకుని తనను తాను తీర్చుదిద్దుకొని వార్డు సమస్యలపై దృష్టి సారిస్తున్నాన్నారు.అనంతరం బారాముల్లా మరియు తమీంలను శాలువా కప్పి, మెమోంటోతో సన్మానించారు.

Back to top button
Enable Notifications    OK No thanks