Abdul JavidNandyal

హత్యకు గురైన కేశవ్ కుటుంబానికి 4 లక్షల రూపాయలను అందజేసిన ఎమ్మార్వో, డిఎస్పీలు

నంద్యాల (పల్లెవెలుగు) 19 ఆగష్టు: ఇటీవల హత్యకు గురైన చెన్న కేశవ్ (V5 రిపోర్టర్) కుటుంబానికి ప్రభుత్వం నుండి 8.25 లక్షల పరిహారంలో భాగంగా తక్షణ సహాయంగా 4 లక్షల రూపాయలను కేశవ సతీమణికి, కుటుంబ సభ్యులకు పరిహార పత్రాన్ని నంద్యాల తహసీల్దార్ రవికుమార్, డిఎస్పీ చిదానంద రెడ్డి, సిఐ రమణ, ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ జిల్లా కమిటీ మెంబెర్ మమతా రెడ్డిలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా కార్యవర్గ సభ్యులు ఉస్మాన్ బాషా, కనక రాజు, నంద్యాల కమిటీ సభ్యులు ప్రదీప్, ఇమ్రాన్ తో పాటు రఘు, జాషువా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా డిఎస్పీ చిదానంద రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం నుండి రావాల్సిన పరిహారం వెంటనే అందేలా జిల్లా కలెక్టర్, ఎస్పీ లు చొరవ తీసుకొని అందజేశారని, ఇంటి స్థలం, ప్రభుత్వ పరంగా ఎటువంటి సహాయ, సహకారాలు కావాలన్నా అందిస్తామన్నారు. ఉస్మాన్ బాష మాట్లాడుతూ కేశవ భార్యకు ప్రభుత్వ ఉద్యోగం వచ్చేలా కృషి చేయాలని కోరారు.

Back to top button
Enable Notifications    OK No thanks