Abdul JavidNandyal

కొ. ఆప్షన్ సభ్యుడు సలాముల్లాహ కు ఘన సన్మానం

నంద్యాల (పల్లెవెలుగు) 18 ఆగష్టు: ఎపి ఉర్దూ టీచర్స్  అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సి. అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో నంద్యాల పురపాలక సభ్యుడు గా ఏకగ్రీవం గా ఎన్నికైన సలాముల్లాహ ను అసోసియేషన్ తరపున ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మైనారిటీ కోటా లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యందుకు అసోసియేషన్ నాయకులు ఎండి. ఇబ్రహీం, ముఖ్తార్ బాష, ఎండి. ఖాసిం, హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సలాముల్లాహ మాట్లాడుతూ ఉర్దూ మీడియం విద్యార్థుల భవిష్యత్తు, ఉర్దూ పాఠశాలల అభివృద్ధికి, ఉర్దూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందించటకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.. ఈ కార్యక్రమం లో మున్సిపల్ ప్రాధమిక పాఠశాలల సూపర్వైజర్ నౌమాన్ బాష, ఉర్దూ C.R.P నవాజ్ బాష పాల్గొన్నారు.

Back to top button