Abdul JavidNandyal

పెంచిన వంట గ్యాస్ ధరలు తక్షణమే ఉపసంహరించుకోవాలి CPI, CPIML న్యూడెమోక్రసీ PYL

నంద్యాల (పల్లెవెలుగు) 18 ఆగష్టు:  కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ గ్యాస్ ధర పెంచిన ధరలను తగ్గించాలని కోరుతూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా వామపక్ష పార్టీల నాయకులు SMD. రఫీ, S. షరీఫ్ బాషా, U. నవీన్ కుమార్, S. మాభాష మాట్లాడుతూ కరోనా కష్టకాలం ఉన్నటువంటి ప్రజలను రోజురోజుకు గ్యాస్ ధరలను పెంచుతూ పేద ప్రజల పై భారం మోపుతున్న కేంద్ర ప్రభుత్వo పెట్రోలు డీజిల్ గ్యాస్ ధరలు పెంచడం జరిగింది పేద ప్రజలకు గతంలో సబ్సిడీ పైన దాదాపుగా 200 రూపాయలు కేంద్ర ప్రభుత్వం బ్యాంకు ఖాతాలో వేస్తూ ఉన్నారు. కానీ ఆ సబ్సిడీ కూడా తీసి వేయడం చాలా దుర్మార్గమైన చర్య సబ్సిడీ తీసివేసి పేద ప్రజలకు ఇచ్చేటువంటి సబ్సిడీగ్యాస్ ధర పైన మళ్ళీ 25 రూపాయలు పెంచడం చాలా బాధాకరం ఇప్పటికే డీజిల్ పెట్రోల్ పెంచినందుకు దానిపై నిత్యావసర ధరలు పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వెంటనే పెంచిన సబ్సిడీ గ్యాస్ ధరను తగ్గించి మహిళల బ్యాంకు ఖాతాల్లో సబ్సిడీ వేయాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో వామపక్ష పార్టీల నాయకులు  తదితరులు పాల్గొన్నారు

Back to top button
Enable Notifications    OK No thanks