Abdul JavidNandyal

జర్నలిస్ట్ ల సమస్యలను పరిష్కరించాలి

నంద్యాల (పల్లెవెలుగు) 17 ఆగష్టు: ఆంధ్రప్రదేశ్ లో పాత్రికేయులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల సామరస్య పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (ఏపీయూడబ్ల్యూజే ) గత రెండేళ్ల కాలంగా శాయశక్తులా ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. సమస్యలు ఇంకాస్త జటిలం అవుతూ వచ్చాయే తప్ప వాటికి పరిష్కారాలు దొరకలేదు. కరోనా మహమ్మారి మొదలయిన తర్వాత జర్నలిస్టుల పరిస్థితి మరీ దారుణంగా తయారయింది . చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. కొనసాగుతున్న వారి వేతనాలలో యాజమాన్యాలు పెట్టాయి. జర్నలిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికి వరకు 128 మంది పాత్రికేయులు మరణించారు. దేశంలోనే జర్నలిస్టుల మరణాలలో అగ్రస్థానంలో వుంది. కేంద్ర ప్రభుత్వం చాలా రాష్ట్రాలు జర్నలిస్టులను ఇంట్ లైన్ వారియర్స్ కింద గుర్తించి కోవిడ్ కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు సాయం అందిస్తున్నాయి. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారిని ఐజేయూ జాతీయ అధ్యక్షుడు కె. శ్రీనివాస్ రెడ్డి గత అక్టోబర్ లో కలిసి జర్నలిస్టుల సమస్యలను, ఆందోళనను వివరించిన పిదప కరోనా వల్ల మృతి చెందిన పాత్రికేయుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున సాయం అందించేందుకు అంగీకరించారు . ఆ ప్రకారం అప్పటికి సాయం పొందాల్సిన 45 మంది మృతుల కుటుంబాల జాబితాను ఏపీయూడబ్ల్యూజే సమాచార కమిషనర్ కు అందించింది . దానిని పరిశీలించి వారిలో 25 మందికి మాత్రమే అర్హత ఉందని సమాచార శాఖ అర్మానించింది . ఆ కుటుంబాలకు 5 లక్షల రూపాయల సాయం అందించడానికి సంబంధించి ఆర్థిక శాఖ ఆమోదంతో 2021 మార్చి నెలలో జీవో ( ఆ నంబర్ 154 ) జారీ చేశారు . కానీ ఇంతవరకూ ఒక్కరికి కూడా సాయం అందలేదు . ముఖ్యమంత్రి స్వయంగా ఇచ్చిన హామీకి సమాచార శాఖ గౌరవిస్తున్న తీరుయిది ! జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డులు జారీ చేయలేకపోయింది . సమాచార శాఖ . అక్రెడిటేషన్ కమిటీల్లో 2 జర్నలిస్టులకు చోటు లేకుండా చేసి సహేతుకం కాని నిబంధనలతో ఇటీవల మొదలయిన జారీ ప్రక్రియ నత్త నడక నడుస్తోంది . జర్నలిస్టులకు ఆరోగ్య బీమా లేదు . ఇళ్ల స్థలాలు మంజూరు కావడం లేదు . వెల్ఫేర్ కమిటీ , భద్రతా కమిటీలను పునరుద్ధరించలేదు . సతమతమవుతున్నారు . పలు పర్యాయాలు సమస్యలను సంబంధిత అధికారవర్గానికి విన్నవించడం ఇలా పలు సమస్యలతో పాత్రికేయులు జరిగింది . కోవిడ్ కారణంగా మృతి చెందిన జర్నలిస్టుల కుటుంబాలకు ప్రభుత్వం ఇచ్చిన జీవో మేరకు వెంటనే 5 లక్షల రూపాయల ఆర్ధిక సాయం అందించాలని ఏపీయూడబ్ల్యూజే డిమాండ్ చేస్తున్నది . మిగతా సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి సమక్షంలో ఒక ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయాలనీ యూనియన్ కోరుతున్నది . ఈ రెండు తక్షణ డిమాండ్లతో ఏపీయూడబ్ల్యూజే వ్యవస్థాపక దినమయిన ఈ రోజును సావధాన దినంగా పాటిస్తున్నాం . మా డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం . ప్రజాస్వామ్య వ్యవస్థలో నాల్గొవ స్థంభంగా భావించే మీడియాను పరిరక్షించాలని కోరారు.

Back to top button
Enable Notifications    OK No thanks