Abdul JavidNandyal

నంద్యాల ఉర్దూ కళాశాలను కాపాడండి

నంద్యాల (పల్లెవెలుగు) 17 ఆగష్టు:  ఉర్దూ కళాశాలను కాపాడండి ఆల్ మేవ గౌరవ అధ్యక్షులు ఎస్.ఎమ్ డి అబులైస్, అధ్యక్షులు ఇమ్రాన్ పాషాల ఆధ్వర్యంలో నంద్యాల శాసనసభ్యులు రవిచంద్ర కిషోర్ రెడ్డి గారిని వారి స్వగృహంలో కలిసి రాష్ట్రంలోనే అత్యధిక ముస్లింజనాభా కలిగిన నంద్యాలలో  ఏడు సంవత్సరాల నిరంతర పోరాట కృషి ఫలితంగా వచ్చిన ఉర్దూ కళాశాలకు శాశ్వత ప్రాతిపదికన అధ్యాపకులను నియమించడం జరగలేదని కేవలం గెస్ట్ ఫ్యాకల్టీ ని మాత్రమే నియమించు కోవాలని ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వం ఇంతవరకు వారికి ఒక్క రూపాయి కూడా వేతనం చెల్లించలేదు కాబట్టి గెస్ట్ ఫ్యాకల్టీ కూడా ఉర్దూ కళాశాలలో పనిచేయుటకు సుముఖంగా లేరు మరోవైపు ప్రభుత్వం 60 మంది కన్నా తక్కువ విద్యార్థులు ఉన్న కళాశాలలను మూసి వేసే ఆలోచన ఉన్నట్టు తెలుస్తోంది కావున ఎమ్మెల్యే గారు రాష్ట్ర విద్యా శాఖా మంత్రితో  మాట్లాడి నంద్యాల ఉర్దూ కళాశాలను అటువంటి వుత్తర్వుల నుండి మినహాయించి కాపాడవలసిందిగా మెమోరాండం ఇవ్వడం జరిగింది, అదే విధంగా పిఎంజెవికె కింద మంజూరైన 6 భవన సముదాయాల కు త్వరితగతిన స్థలాల కేటాయింపు చేయాలని కోరడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆల్ మేవా జిల్లా వైస్ ప్రెసిడెంట్ లతీఫ్, ఆర్గనైజింగ్  సెక్రెటరీ మహమ్మద్ గౌస్ పాల్గొన్నారు

Back to top button
Enable Notifications    OK No thanks