
ప్రైవేటు ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కు వినతి పత్రం
నంద్యాల (పల్లెవెలుగు) 16 ఆగష్టు: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రైవేటు ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నంద్యాల ప్రైవేటు ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ వారు సోమవారం ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిశోర్ రెడ్డి కి ఎలక్ట్రీషియన్ల సమస్యలను వివరించి వినతిపత్రం అందజేయడం జరిగింది. భవన నిర్మాణ కార్మిక సమస్యలపై వినతి పత్రం ఇవ్వడం జరిగింది. లేబర్ కార్డు, ప్రసుత్తి కానుక, పెళ్లి కానుక, మరణించిన కార్మికులకు బీమా, కరోనా కష్టకాలంలో కార్మికుల ఖాతాల్లో డబ్బులు చెల్లిస్తామని చెల్లించకపోవడం. మరికొన్ని అంశాలతో కూడిన వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నంద్యాల అసోసియేషన్ ప్రెసిడెంట్ డి. హుసైన్, వైస్ ప్రెసిడెంట్ ఎన్.యండి. రఫీ, జాయింట్ సెక్రటరీ గురుమూర్తి, ట్రెజర్ రామయ్యా, అసోసియేషన్ సభ్యులు ఇస్మాయిల్ మాబాష సుబ్బయ్య వలి ఇంతియస్ బాష మగబుల్ తదితరులు పాల్గొన్నారు.