Abdul JavidNandyal

మానవ మృగం శశికృష్ణను ఎన్కౌంటర్ చేయాలి వాల్మీకి సంఘ మహిళా నేత భారతి

  • గుంటూరులో బిటెక్ విద్యార్థిని రమ్యశ్రీని కత్తితో పొడిచి హత్య చేసిన నిందితులను బహిరంగంగా ఎన్కౌంటర్ చేయాలి
  • వాల్మీకి మహిళాసంఘ జిల్లా ఉపాద్యక్షురాలు బోయ భారతి డిమాండ్
  • దిశ చట్టం అమలులో ఉన్నప్పటికీ కూడా మహిళాలపై దాడులు, హత్య లు జరగడం చాలా దారుణం
  • దిశ చట్టాన్ని సక్రమంగా అమలుచేసి రమ్యశ్రీని హత్య చేసిన నిందితున్ని బహిరంగంగా ఎన్కౌంటర్ చేయాలి
  • అప్పుడే మహిళలపై హత్యలు,దాడులు ఆగుతాయి

నంద్యాల (పల్లెవెలుగు) 16 ఆగష్టు:  తెలంగాణలో ప్రియాంక రెడ్డిని (దిశ)ను హత్య చేసిన నిందితులను ఎన్కౌంటర్ చేసారు కదా అలాగే ఇప్పుడు రమ్యశ్రీని హత్య చేసిన వారిని కూడా బహిరంగంగా ఎన్కౌంటర్ చెయ్యాలని భారతి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ రోజు స్థానిక వాల్మీకి కార్యాలయంలో మహిళనాయకురాలు భారతి మాట్లాడుతూ నిన్న గుంటూరులో రమ్య శ్రీ అనే బిటెక్, దళిత మహిళను అత్యంత దారుణంగా, పాశవికంగా కత్తితో పొడిచి చంపిన మానవమృగం శశి కృష్ణ ను కఠినంగా శిక్షించాలని, దిశ చట్టాన్ని పగడ్బందీగా అమలు చేసి మహిళలకు సంపూర్ణ రక్షణ కల్పించాలని గౌరవ హోమ్ మంత్రి సుచరిత గారికి, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు

Back to top button
Enable Notifications    OK No thanks