
Nandyal
గుంటూరు బీటెక్ అమ్మాయి రమ్యశ్రీ హత్యను ఖండించిన జమాఆతె ఇస్లామి
నంద్యాల (పల్లెవెలుగు) 16 ఆగష్టు: స్వాతంత్ర్య దినోత్సవం రోజు ప్రజల సాక్షిగా గుంటూరు బీటెక్ అమ్మాయి రమ్యశ్రీ ని, శశికిరణ్ అనే యువకుడు కిరాతకంగా హత్య చేయడం హేయమైన చర్య అని మృతునికి వెంటనే ఉరి శిక్ష విధించాలని నంద్యాల జమాఆతె ఇస్లామి హింద్ అధ్యక్షులు అబ్దుల్ సమద్ హత్యను తీవ్రంగా ఖండించారు. దైవభీతి లేని యువతలో సహజంగానే నైతిక విలువలు సన్నగిల్లి చట్టం పట్ల,శిక్షలు పట్ల భయం లేకుండా పోతుందని, యువతను తీర్చిదిద్దడంలో సమాజం మౌనం వహిస్తే ఇలాంటి దురాగతాలు ఎక్కువ అవుతాయని సమద్ ఈ హత్య చేసిన యువకుడిని పోలీసు అరెస్టు చేయాలని డిమాండు చేసారు. చట్ట సభలకు నైతిక విలువలు కలిగిన వ్యక్తులను పంపె దశకు సమాజం ఎదుగాలనీ పోలీసులు ఛాలెంజిగా తీసుకొని హతుడిని ముప్పాళ్ళ హెడ్ కానిస్టేబుల్ వెంటాడి పట్టుకున్న సమాచారం రావడం హర్శనీయం. కార్య క్రమం లో జమాత్ నాయకులు పాల్గొన్నారు.