Nandyal

ఎయిడెడ్ విద్యాసంస్థలను నిర్వీర్యం చేసే జీవో నెం 52 కాపీలను దహనం చేశారు

PDSU జిల్లా సహాయ కార్యదర్శి S. MD రఫీ,PYL జిల్లా నాయకులు నవీన్ కుమార్

నంద్యాల (పల్లెవెలుగు) 16 ఆగష్టు: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎయిడెడ్ విద్యాసంస్థలను నిర్వీర్యం చేసేందుకు తీసుకువచ్చిన జి ఓ నెం: 52 రద్దు చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(PDSU) జిల్లా సహాయ కార్యదర్శి S. MD రఫీ, PYL జిల్లా నాయకులు నవీన్ డిమాండ్ చేశారు. సోమవారం నాడు నంద్యాల పట్టణంలోని స్థానిక రాజ్ టాకీస్ సర్కిల్ నందు ధర్నా నిర్వహించి, జిఓ 52 కాపీలను దహనం చేశారు. ఈ సందర్భంగా   PDSU జిల్లా సహాయ కార్యదర్శి S. MD రఫీ, PYL జిల్లా నాయకులు నవీన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎయిడెడ్ విద్యాసంస్థల్లో 2021-22 విద్యాసంవత్సరంలో  అడ్మిషన్లు నిలిపివేసేందుకు సర్క్యులర్ జారీ చేసింది. ఈ నెల జివో 52  ద్వారా గతంలో ప్రభుత్వానికి కొన్ని ఎయిడెడ్ కాలేజీలు ప్రభుత్వానికి అప్పగించేందుకు అంగీకారం తెలియజేయడంతో వాటిని ప్రభుత్వం తీసుకునేందుకు మరియు ఇవ్వని కాలేజీలు ఆ యాజమాన్యాలు నిర్వహించుకోవాలని, వాటి బాధ్యత ప్రభుత్వానికి ఉండదని జీవో లో పేర్కొన్నారని అన్నారు. 2020 – 21  (ఎయిడెడ్ కాలేజీలో) విద్యాసంవత్సరంలో 141 డిగ్రీ కాలేజీలో 73 వేల 120 మంది విద్యార్థులు చేరారు. 182 జూనియర్ కాలేజీలో 71 వేల 35 మంది విద్యార్థులు చేరడం జరిగింది. 2203  హైస్కూల్ పాఠశాలలో  1,96, 313 మంది మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.  రాష్ట్రవ్యాప్తంగా 2,526 ఎయిడెడ్  విద్యా సంస్థలో రెండు లక్షల 30 వేల మూడు వందల అరవై ఎనిమిది మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. వారందరి భవిష్యత్తు అంధకారంగా మారుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. అనేక దశాబ్దాల కాలంగా ఈ విద్యా సంస్థలు అనేక మంది మేధావులను సృష్టించిందన్నారు. విద్యకు దూరమైన పేద బడుగు వర్గాలకు చెందిన విద్యార్థులను ఈ సంస్థలు అక్కున చేర్చుకుని జ్ఞానాన్ని అందించడమే కాకుండా  ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కి చెందిన లక్షల మంది విద్యార్థులు ఎయిడెడ్ విద్యాసంస్థల్లో విద్యనభ్యసిస్తున్నారని తెలియజేశారు. ఎయిడెడ్ విద్యా సంస్థల ఆస్తులు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని కోట్ల రూపాయల విలువ కలిగి ఉన్నాయి . వీటిని కాజేసేందుకు ఒక కుట్ర జరుగుతుందని అన్నారు. ఎయిడెడ్ విద్యాసంస్థలను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం చేసే కుట్రలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జి. ఓ 52 రద్దు చేయాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో PDSU ఆధ్వర్యంలో పెద్దఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో PDSU డివిజన్ నాయకులు అఖిల్, గిరి, వంశీ, మధు, జీలని, హరి, వినోద్ తదితరులు పాల్గొన్నారు.

Back to top button
Enable Notifications    OK No thanks